జీ టీవి సీరియల్స్ టైటిల్ సాంగ్స్ ఎవరు పాడారో తెలుసా ?

zee telugu serials songs :ప్రస్తుతం జి తెలుగులో ప్రసారమవుతున్న కొన్ని సీరియల్స్ బాగా రన్ అవుతున్నాయి. ప్రేక్షకాదరణ ఉంది. పాత్రల పరంగానే కాకుండా టైటిల్ సాంగ్స్ వలన కూడా సీరియల్స్ పాపులార్టీ సంపాదించాయి. నెంబర్ వన్ కోడలు సీరియల్ పేరుకు తగ్గట్టు ఆడియన్స్ లో దూసుకెళ్తోంది. హిందీలో కూడా రీమేక్ అయిన ఈ సీరియల్ లో టైటిల్ సాంగ్ ని రాహుల్ సిప్లిజంగ్ పాడారు. త్రినయని సీరియల్ టాప్ వన్ గా నిల్చింది. ఇందులో టైటిల్ సాంగ్ ని సింగర్ కారుణ్య పాడారు.

నాగభైరవి సీరియల్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఆకట్టుకుంటోంది. జి తెలుగు ఆడియన్స్ బాగా ఆదరిస్తున్న ఈ సీరియల్ లో సింగర్ మంగ్లీ తన అద్భుత గొంతుతో టైటిల్ సాంగ్ పాడారు. కల్యాణ వైభోగమే సీరియల్ 2017నుంచి సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. సింగర్ రేవంత్ టైటిల్ సాంగ్ పాడారు. హిట్లర్ గారి పెళ్ళాం టైటిల్ సాంగ్ సినిమా సాంగ్ కి ధీటుగా ఉంటుంది. టైటిల్ సాంగ్ ని దినకరన్, అపర్ణ ఆలపించారు.

రాధమ్మ కూతురు సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. టైటిల్ సాంగ్ ని సింగర్ రేవంత్ పాడారు. ఇటీవల స్టార్ట్ కాబడ్డ కృష్ణ తులసి సీరియల్ ని ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇందులో టైటిల్ సాంగ్ ని ఎం ఎం శ్రీలేఖ పాడారు. ప్రేమ ఎంత మధురం టైటిల్ సాంగ్ జనాదరణ పొందింది. ఈ సాంగ్ ని యూట్యూబ్ లో వన్ మిలియన్ పైగా ఆడియన్స్ వీక్షించారు. రమ్య బెహరా, దినకర్ అద్భుతంగా ఈ సాంగ్ ని ఆలపించారు.