ఎక్కిళ్ళు అదే పనిగా వస్తున్నాయా…ఈ టిప్స్ మీకోసమే

ekkillu In English :ఒక్కోసారి కొందరికి అదేపనిగా ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో మనకే కాదు పక్కన ఉన్నవారికి కూడా కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అందుకే తరచూ వచ్చే ఎక్కిళ్ళను ఇంటిలో సులభంగా అందుబాటులో దొరికే వస్తువులతో ట్రై చేయవచ్చు.

అల్లం : చాలా మంది అల్లాన్ని వంటల్లో వేస్తారు కానీ తినటానికి ఇష్టపడరు. కానీ అల్లాన్ని సన్నని ముక్కలుగా కోసి ఎక్కిళ్ళు వచ్చినప్పుడు బుగ్గలో పెట్టుకొని చప్పరించాలి. ఇలా చేయుట వలన ఎక్కిళ్ళు తొందరగా ఆగిపోతాయి.

యాలకులు : ఒక కప్పు నీటిలో ఒక స్పూన్ యాలకుల పొడి వేసి మరిగించాలి. ఈ నీటిని వడకట్టి త్రాగాలి. ఈ నీటి వల్ల గొంతు,శ్వాస వ్యవస్థలు ఉత్తేజితమై ఎక్కిళ్ళు తగ్గిపోతాయి.

ఆవాలు : చిటికెడు ఆవాల పొడిలో అరస్పూన్ నెయ్యి వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని తినాలి. ఈ విధంగా చేస్తే ఎక్కిళ్ళు త్వరగా ఆగిపోతాయి.

వెనిగర్ : ఎక్కిళ్ళు వచ్చినప్పుడు రెండు చుక్కల వెనిగర్ ని నాలిక మీద వేసుకుని చప్పరిస్తే, ఆ పుల్లదనానికి వెంటనే ఎక్కిళ్ళు ఆగిపోతాయి.