MoviesTollywood news in telugu

కార్తీకదీపం సీరియల్ దీప క్యారెక్టర్ ని మిస్ చేసుకున్ననటి ఎవరో…?

karthika deepam serial Deepa :మా టివిలో పాపులర్ గా మారి, విశేష ప్రేక్షకాదరణ పొందుతున్న కార్తీక దీపం సీరియల్ నెంబర్ వన్ గా నిల్చింది. ఈ సీరియల్ లో అలరిస్తూ వంటలక్కగా గుర్తింపు పొందిన దీప కీలక పాత్ర అయింది. ఈమెను చూడగానే తెలుగు అమ్మాయి అనుకుంటాం. కానీ ఈమె కేరళకు చెందిన భామ. ఈమె పేరు ప్రేమీ విశ్వనాధ్. మలయాళంలో ఈమె కొన్ని సీరియల్స్ చేసింది.

మలయాళంలో నటించిన సీరియల్ లో నల్లటి అమ్మాయిలా నటించి అందరి మనసు దోచుకుంది. రెండు అవార్డులు వచ్చాయి. తెలుగులో మాత్రం ఇది దీపకు తొలి సిరియల్. ఈ సీరియల్ దీప నటనకు ఎక్కడలేని క్రేజ్ వచ్చేసింది. ఫలితంగా ఈ సీరియల్ కి మంచి పేరు వచ్చేసింది.

టిఆర్పి రేటింగ్ లో దూసుకుపోతున్న ఈ సీరియల్ లో దీప పాత్రకు ప్రేమీ విశ్వనాధ్ కన్నా ముందు వరూధిని పరిణయం సీరియల్ తో మంచి పేరు తెచ్చుకున్న చందన శెట్టి ని అడిగారట. ఆ సీరియల్ లో ఆమెకు మంచి పేరు వచ్చింది. జ్యోతి సీరియల్ లో నటిస్తున్న చందన మోడలింగ్ లో కూడా దూసుకెళ్తోంది. అయితే కార్తీకదీపం సీరియల్ ని కొన్ని కారణాల వలన మిస్ చేసుకుంది.