ఎటువంటి వ్యాయామం, డైట్ లేకుండా ఈ డ్రింక్ తో కేవలం 5 రోజుల్లో పొట్ట కొవ్వు మొత్తం మైనంలా కరుగుతుంది

Keera Weight Loss Drink In Telugu :ఈ రోజుల్లో వయస్సుతో సంబందం లేకుండా ప్రతి ఒక్కరూ అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఈ రోజు కీర దోస ఉపయోగించి అధిక బరువు సమస్య తొలగించుకోవటానికి ఒక డ్రింక్ తయారుచేసుకుందాం. ఈ డ్రింక్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది శరీర బరువును చాలా వేగంగా తగ్గిస్తుంది బొడ్డు చుట్టూ ఉన్న కొవ్వును కరిగిస్తుంది. ఈ డ్రింక్ తీసుకుంటే శరీరంలో నీటి కొరత లేకుండా డీహైడ్రేషన్ సమస్య లేకుండా చేస్తుంది

ఈ డ్రింక్ వేసవి కాలంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది. కీరదోస లో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన ఈ డ్రింక్ తీసుకున్నప్పుడు కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండేలా చేసి ఆకలి తొందరగా వేయకుండా చేస్తుంది దాంతో తీసుకునే ఆహారం క్వాంటిటీ తగ్గుతుంది.

కీరదోస తో జ్యూస్ చేయడానికి కీర దోసను ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసినప్పుడు కీర దోస తొక్కలను తీయకూడదు.తొక్కలో కూడా చాలా పోషకాలు ఉంటాయి. ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి దానిలో కొన్ని కరివేపాకు ఆకులను,నీటిని పోసి మిక్సీ చేసి గ్లాసు లో పోసి దానిలో అరచెక్క నిమ్మరసం,కొంచెం జీలకర్ర పొడి కలిపి తాగాలి.

ఈ డ్రింక్ ప్రతి రోజు ఉదయం తాగవచ్చు. లేదా మీకు వీలు ఉన్నప్పుడూ తాగవచ్చు. అయితే తాగటానికి ముందు రెండు గంటలు కడుపు ఖాళీగా ఉంటే మంచిది.