కార్తీకదీపంలో విలన్ రోల్ ని ఎంత మంది రిజెక్ట్ చేశారో…?

karthika deepam serial :పాపులర్ సీరియల్ గా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్న కార్తీక దీపం సీరియల్ ఇంకా టాప్ రేంజ్ లో ఉంది. ఈ సీరియల్ లో నటిస్తున్న కార్తిక్, దీప వలన ఈ సీరియల్ కి ఎంతో పేరు వచ్చింది. అలాగే మోనిత వలన కూడా అంతే పేరు వచ్చింది. నెగెటివ్ రోల్ చేసి ఆడియన్స్ నుంచి మంచి మార్కులు తెచ్చుకుంది.

నిజానికి ఈ సీరియల్ లో నెగెటివ్ రోల్ కి మొదట్లో నో చెప్పిన మోనిత ఆతర్వాత ఆ రోల్ తోనే ఎక్కడలేని క్రేజ్ తెచ్చుకోవడం విశేషం. ఈమె కన్నడ అమ్మాయి. ఈమె పేరు శోభాశెట్టి. ఈమె పలు కన్నడలో అగ్నిసాక్షి వంటి సీరియల్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకుని తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. అంజనీ పుత్ర అనే మూవీలో కూడా చేసిన శోభా శెట్టి తమిళంలో సీరియల్స్ లో నటించింది.

స్టార్ మాలో అష్టాచెమ్మా సీరియల్ లో నటించి, బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకుంది. అత్తారింటికి దారేది, లాహిరి లాహిరి లో సీరియల్స్ లో నటించింది. అయితే హిట్లర్ గారి పెళ్ళాం సీరియల్ లో నటించిన సునంద మాలతి శెట్టి ని కార్తీకదీపం సీరియల్ లో విలన్ రోల్ కి సెలక్ట్ చేసారు. ముద్దమందారం సీరియల్ లో నీలాంబరిగా మంచి పేరు వచ్చింది. అయినా సరే, కార్తీకదీపం సీరియల్ ని రిజెక్ట్ చేసింది. సునంద సిరియల్స్ తో బిజీగా ఉండటంతో రిజెక్ట్ చేసిందని సమాచారం.