వేసవిలో ముఖం జిడ్డుగా మారుతుందా…బెస్ట్ ఫాక్స్

Oily Skin Tips :కొన్ని నల్ల ద్రాక్ష పళ్ళను తీసుకోని మెత్తగా గ్రైండ్ చేసుకొని దానికి రెండు స్పూన్ల ముల్టాన మట్టిని కలపాలి. ఆ తర్వాత దానిలో కొద్దిగా రోజ్ వాటర్,మూడు చుక్కల నిమ్మరసం వేసి మెత్తని పేస్ట్ గా తయారుచేయాలి. ఆ తర్వాత ఈ పేస్ట్ ని ముఖానికి,మెడకు బాగా పట్టించాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖాన్ని,మెడను కడిగి మాయీ శ్చరైజర్ రాసుకోవాలి.

నల్ల ద్రాక్ష గుజ్జుకి ఒక స్పూన్ పుదినా పేస్ట్,ఒక స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ లో కొంచెం రోజ్ వాటర్ వేసి దానిలో ఒక ఐస్ క్యూబ్ వేసి, ఫేస్ ప్యాక్ తీసిన వెంటనే ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే,ముఖంపై అధికంగా ఉన్న జిడ్డు తొలగిపోతుంది.

రెండు స్పూన్ల నల్ల ద్రాక్ష గుజ్జుకు ఒక స్పూన్ బొప్పాయి గుజ్జు,ఒక స్పూన్ తేనే కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రంగా కడగాలి. ద్రాక్షలో ఉండే సహజ ఆమ్లాలు,విటమిన్స్ చర్మానికి కొత్త కాంతిని అందిస్తాయి.