మెగాస్టార్,బాలయ్యతో గౌతమి ఎందుకు నటించలేదంటే…కారణం ఇదే

Actress gawthami and chiranjeevi :సినిమా ఇండస్ట్రీ వింతగానే ఉంటుంది. కొన్ని కాంబినేషన్స్ అనుకోకుండా సెట్ అవుతాయి. కొన్ని అనుకున్నా సెట్ కావు. కొన్ని కాంబినేషన్స్ ప్రయత్నించినా ఎందుకో వర్కవుట్ కావు. ఇక ఇండస్ట్రీలో నిలబడాలంటే,గ్లామర్,అభినయంతో పాటు అదృష్టం కూడా కంపల్సరీగా ఉండాల్సిందే.

కొందరు స్టార్ హీరోయిన్స్ నటన ప్రాధాన్యత గల పాత్రలను ఎంచుకుంటూ యాక్ట్ చేసుకుంటూ పొతే,ప్రేక్షకులుబాగానే ఆదరిస్తారు. అప్పుడు వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం ఉండదు. ఇక తెలుగు నటి అయినప్పటికీ తమిళంలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన గౌతమి పలు తెలుగు సినిమాలలో కూడా నటించి మెప్పించింది. సౌత్ ఇండియా సూపర్ స్టార్ కమల్ హాసన్ తో గౌతమీ కొన్నేళ్లు సహజీవనం కూడా చేసింది.

అయితే మెగాస్టార్ చిరంజీవితో మాత్రం ఈమె కల్సి నటించలేకపోయింది. చిరంజీవితో సినిమాలో చేద్దామని అనుకున్నప్పుడల్లా రజినీ కాంత్ సినిమా డేట్లతో ఇబ్బంది అయ్యేదని అందుకే చిరంజీవితో నటించే ఛాన్స్ రాలేదని తాజాగా ఓ కార్యక్రమంలో చెప్పుకొచ్చింది. అలాగే బాలకృష్ణతో కూడా కలిసి నటించలేక పోయానని గౌతమీ చెప్పుకొచ్చింది. ఇటీవల తమిళనాట జరిగిన ఎన్నికల్లో బిజెపి తరపున ప్రచారం చేసిన ఈమె కమల్ కి వ్యతిరేకంగా ప్రచారం సాగించడం విశేషం.