కార్తీక దీపం సీరియల్ కార్తీక్ క్యారెక్టర్ ని రిజెక్ట్ చేసింది ఎవరు?

karthika deepam serial Karthik :మాటీవీలో కార్తీకదీపం సీరియల్ ఎంతగా పాపులర్ అయిందో చెప్పక్కర్లేదు. టాప్ టిఆర్పి రేటింగ్ తో దూసుకెళ్తోంది. ఇందులో నిరుపమ్ పరిటాల ఓపక్క డాక్టర్ గా,మరోపక్క కార్తీక్ గా నటిస్తున్నాడు. చంద్రముఖి, మూగమనసులు, కాంచనగంగ వంటి సీరియల్స్ లో నిరుపమ్ తన తనటనతో ఆకట్టుకున్నాడు.

ఇవన్నీ ఒక ఎత్తయితే కార్తీకదీపం ఆడియన్స్ కి నిరుపమ్ ని మరింత దగ్గర చేసింది. ఒక డాక్టర్ గా,భర్తగా ఒక చెడ్డ పాత్రలో ఉన్నాడని చెప్పాలి. ఈ సీరియల్ లో నిరుపమ్ ని సెలక్ట్ చేసేముందు ఓ టాప్ హీరోని రిజెక్ట్ చేసిందట సీరియల్ యూనిట్. ఆ వివరాల్లోకి వెళ్తే, అతడే నందకిషోర్. 25సీరియల్స్,10మూవీస్ చేసాడు.

ప్రస్తుతం రామ సక్కనోడు సీత సీరియల్ లో హీరోగా చేస్తున్న నందకిషోర్ చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం వలన నేర్చుకుని మరీ ఇండస్ట్రీకి వచ్చాడు. 2001లో వెలుగు నీడలు సీరియల్ తో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చాడు. ఆయనా ఛానల్స్ లో వచ్చిన జ్యోతి, హ్యాపీ చి ల సౌ స్రవంతి ఇలా పలు సీరియల్స్ లో చేసాడు. అయితే కార్తీకదీపం సీరియల్ ని రిజెక్ట్ చేశాడు.