త్రినయని సీరియల్ హీరోయిన్ గురించి ఈ విషయాలు తెలుసా?

Telugu serial actress ashika gopal padukone :స్టార్ మా లో ప్రసారం అయిన కథలో రాజకుమారి సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరకు పరిచయం అయింది ఆషిక గోపాల్ పడుకొనె. ఈ సీరియల్ మంచి టిఆర్పి రేటింగ్ తో సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది ఆ తర్వాత మరొక సీరియల్ జీ తెలుగులో ప్రసారం అవుతున్న త్రినయని లో తన అందం నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. త్రినయని సీరియల్ జీ తెలుగు టాప్ ఫైవ్ సీరియల్స్ లో ఒకటిగా ఉంది ఈ సీరియల్ .లో అషిక ముందుగానే జరగబోయే భవిష్యత్తును చూసి కూడా కష్టాలు పడుతూ కుటుంబాన్ని రక్షించే పాత్రలో నటించింది.

1996 సంవత్సరంలో పుట్టిన అషిక మోడల్ గా కూడా పని చేసింది. ఈమె కర్ణాటక లోని బెంగుళూరు లో పుట్టింది. బెంగళూరులోని దయానంద సాగర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ లో ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ చదివింది. త్రినయని సీరియల్ లో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది తన నటనతో అందరినీ మెప్పించింది.