Healthhealth tips in telugu

ఒక స్పూన్ పొడి చాలు చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు 100శాతం రోగనిరోదకశక్తి పెరుగుతుంది.

Immunity Powder in Telugu :మనకు తెలియకుండానే మనలో రోగనిరోధక శక్తి మన శరీరానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. హానికరమైన వైరస్‌లు,బ్యాక్టీరియాలు,ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి శరీరాన్ని కాపాడుతూ వస్తుంది. అయితే కొందరిలో ఈ వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల త్వరగా జబ్బు పడతారు. సాధారణంగా మానవుడు సంవత్సర కాలంలో మూడు సార్లు జలుబు బారిన పడే అవకాశం ఉందని చెబుతుంటారు. కానీ అంతకంటే ఎక్కువ సార్లు జలుబు చేయడం.. కోలుకోవడానికి ఎక్కువ సమయం పడితే.. అతనిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నట్లు భావించాలి. ఒక్కోసారి ఇమ్యూనిటీ పవర్‌ తక్కువగా ఉంటే కొన్ని వ్యాధులకు చికిత్స చేయడం కూడా కుదరదు.

వ్యాధి నిరోదక శక్తిని పెంచుకోవటానికి ఒక డ్రింక్ తయారీ విధానం గురించి తెలుసుకుందాం. ఒక మిక్సీ జార్ లో 20 ఫుల్ ముఖాన, 10 బాదం పప్పులు,ఒక స్పూన్ నువ్వులు,అరస్పూన్ సొంపు,2 దాల్చిన చెక్క చిన్న ముక్కలు లేదా పావు స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి మెత్తని పొడిగా తయారుచేసుకోవాలి. ఈ పొడిని నిల్వ చేసుకోవచ్చు.

ఒక గ్లాస్ పాలల్లో ఒక స్పూన్ పొడి వేసి కలుపుకొని ఉదయం సమయం లేదా రాత్రి పడుకోవటానికి అరగంట ముందు తాగితే శరీరంలో రోగనిరోదక శక్తి పెరుగుతుంది. ఈ విధంగా మూడు రోజులు తాగి ఒక రోజు గ్యాప్ ఇచ్చి మరల మూడు రోజులు తాగాలి. ఇలా రెండు నెలలు పాటు తాగితే సరిపోతుంది.