షణ్ముఖ్ జస్వంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్

youtube star shanmukh jaswanth : యూట్యూబ్ లో వెబ్ సిరీస్ చేస్తూ షణ్ముఖ్ జస్వంత్ చాలా ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు ఒక వీడియో పెడితే మిలియన్ కొద్ది వ్యూస్ రావటమే కాకుండా వీడియో నాలుగు రోజుల వరకు నంబర్ వన్ ట్రెండింగ్ లో ఉంటుంది. సంవత్సరం క్రితం వరకు నార్మల్ యూట్యూబ్ గానే ఉన్నాడు షణ్ముఖ్ జస్వంత్. సాఫ్ట్ వేర్ డెవలపర్ సిరీస్ తో ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు.

సాఫ్ట్ వేర్ డెవలపర్ తర్వాత షన్ను పోస్ట్ చేసిన ప్రతి వీడియో టెన్ మిలియన్ మార్క్ అందుకుంటుంది. ప్రస్తుతం సూర్య వెబ్ సిరీస్ చేస్తున్నాడు దీనికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పటివరకు 6 ఎపిసోడ్ వచ్చాయి. ఏడవ ఎపిసోడ్ మే 7 న విడుదల కానున్నది మొత్తం పది ఎపిసోడ్లను ప్లాన్ చేశారు. ఒక్కో ఎపిసోడ్ పూర్తి చేయటానికి 10 నుంచి 15 రోజుల వరకూ సమయం పడుతుంది. ఇక మూడు ఎపిసోడ్లను ప్రస్తుతం కరోనా కారణంగా షూట్ చేయడం లేదని దర్శకనిర్మాతలు చెప్పేశారు దాంతో సూర్య web series అభిమానులకు నిరాశ ఎదురైంది మిగతా 3 సూర్య web series ఎపిసోడ్లను చూడటానికి వేచి చూడాల్సిందే.