Healthhealth tips in telugu

గ్లాస్ మజ్జిగలో ఇది కలిపి త్రాగితే పొట్ట చుట్టూ కొవ్వు కరిగిపోయి స్లిమ్ గా మారతారు

Weight Loss Tips In telugu :ఉదయం నిద్ర లేవగానే కాఫీ లేదా టీ త్రాగి దినచర్యను మొదలుపెడతాం. ఉదయం పరగడుపున త్రాగటం వలన జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాఫీ,టీ లకు బదులుగా మజ్జిగ త్రాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు మజ్జిగలో ఏమి కలుపుకొని త్రాగితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.

మజ్జిగలో ప్రొబయోటిక్ బాక్టీరియా ఉండుట వలన కడుపులో మంట, అసిడిటీ, గ్యాస్, అల్సర్ సమస్యలు రాకుండా కాపాడుతుంది. అంతేకాక ఉదయం పరగడుపున త్రాగటం వలన జీర్ణాశయం, పేగులు శుభ్రం అయ్యి వాటిలో ఉండే హానికారక క్రిములు, బాక్టీరియా నశిస్తాయి. అంతేకాక మంచి బాక్టీరియా పెరిగి అజీర్తి, మలబద్దకం సమస్యలను దూరం చేస్తుంది.

మజ్జిగలో రెండు మూడు కరివేపాకు ఆకులు, అర టీ స్పూన్ మిరియాల పొడి కలిపి త్రాగితే అధికంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది. అలాగే రక్తంలో చక్కర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. భోజనం చేసాక పొట్టలో అసౌకర్యంగా ఉంటే మజ్జిగలో అల్లం రసాన్ని కలిపి త్రాగితే సమస్య పరిష్కారం అవుతుంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మజ్జిగ త్రాగి బయటకు వెళ్ళితే డీహైడ్రేషన్ బారిన పడరు. 

విరేచనాలు అవుతున్న వారు ఉదయాన్నే పరగడుపున మజ్జిగలో అర టీస్పూన్ అల్లం రసం కలిపి త్రాగితే విరేచనాలు తగ్గుముఖం పడతాయి.  హైబీపీ ఉన్నవారు ఉదయాన్నే పరగడుపున గ్లాస్ మజ్జిగ తాగితే ఫలితం ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.