Healthhealth tips in telugu

ఈ వండర్ ఫుల్ పండులో ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు

apricot Benefits in telugu :ఆప్రికాట్ లో క్యాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, , విటమిన్ ఎ, ఐరన్ విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఒక కప్పుడు డ్రై ఆప్పికాట్ లో 158 మైక్రోగ్రామ్ విటమిన్ ఎ ఉంటుంది. ఈ డ్రై ఫ్రూట్ లో ఉండే పోషకాలు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే అనేక వ్యాధులు రాకుండా నివారిస్తుంది. మరి ఇప్పుడు ఆ ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం.

రక్తహీనతతో బాధపడేవారికి ఆప్రికాట్ ఉత్తమమైన ఆహారం అని చెప్పవచ్చు. ఇందులో ఉండే కాపర్ ఐరన్ గా షోషింపబడుతుంది. ప్రతి రోజు ఒక ఆప్రికాట్ తింటే హీమోగ్లోబిన్ ఉత్పత్తి పెరిగి రక్తహీనత సమస్య నుండి బయట పడవచ్చు.

డ్రై ఆప్రికాట్ లో పెక్టిన్ మరియు సెల్యులోస్ అనే పీచు పదార్ధం సమృద్ధిగా ఉంటుంది. సెల్యులోజ్ కరగని ఫైబర్ మరియు పెక్టిన్ శరీరంలో వాటర్ లెవల్స్ ను మెయింటైన్ చేయడానికి సహాయపడి మలబద్దకం సమస్య రాకుండా చేస్తాయి.

భోజనానికి ముందు ఒక డ్రై ఆప్రికాట్ ని తింటే జీర్ణక్రియకు సహాయపడతాయి. డ్రై ఆప్రికాట్ లో ఉండే ఆల్కలైన్ మరియు న్యూట్రలైజ్ యాసిడ్స్ జీవక్రియకు సహాయపడతాయి.

జ్వరంగా ఉన్నప్పుడు ఆప్రికాట్ జ్యుస్ లో తేనే కలుపుకొని త్రాగితే జ్వరం తీవ్రత తగ్గుతుంది. అంతేకాక దాహాన్ని కూడా తీరుస్తుంది.

డ్రై ఆప్రికాట్ జ్యూస్ సన్ బర్న్ కారణంగా వచ్చే ఎక్జిమా, దురద, తామర వంటి వాటిని నివారిస్తుంది. అంతేకాక మొటిమల వంటి అనేక చర్మ సమస్యలను తగ్గిస్తుంది.

డ్రై ఆప్రికాట్ లో పొటాషియం సమృద్ధిగా ఉండుట వలన హార్ట్ బీట్ ను రెగ్యులేట్ చేస్తుంది. అలాగే మజిల్ ఫంక్షన్ ను కూడా రెగ్యులేట్ చేస్తుంది.

డ్రై ఆప్రికాట్ లో అధిక న్యూట్రీషియన్స్ విటమిన్ ఎ అధికంగా ఉండి కంటి చూపుకు బాగా సహాయపడుతాయి . విటమిన్ ఎ ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్ . ఇది ఫ్రీరాడికల్స్ ను నివారిస్తుంది మరియు ఇది ఆరోగ్యకరమైన కణాలు, టిష్యూలకు సహాయపడుతుంది.