Healthhealth tips in telugu

పరగడుపున ఉడికించిన వేరుశనగ తింటున్నారా…ఊహించని లాభాలు ఎన్నో…?

Ground nuts Benefits In telugu : వేరుశనగను కొంత మంది ఉడికించి తింటారు. మరి కొంతమంది వేగించుకొని తింటారు. అయితే వెగించిన వేరుశనగ కన్నా ఉడికించిన వేరుశనగ తింటేనే ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెప్పుతున్నారు. ఈ రోజు ఉడికించిన వేరుశనగ తింటే కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. వేరుశనగ అంటే ఇష్టపడనివారు ఎవరు ఉండరు.
peanuts side effects
వీటిని ఎక్కువగా సాయంత్రం సమయంలో స్నాక్స్ గా తీసుకుంటూ ఉంటారు. వేరుశనగ చట్నీగాను మరియు స్నాక్స్ గాను పులిహోర వంటి వాటిల్లో వేస్తూ ఉంటాం. వేరుశనగ గింజల్లో డ్రై ఫ్రూట్స్ లో ఉండే అన్ని పోషకాలు ఉంటాయి. ఉడికించిన వేరుశనగలో విటమిన్స్ అధికంగా ఉంటాయి. వేగించిన వేరుశనగ కన్నా ఉడికించిన వేరుశనగలో ఎక్కువగా పోషకాలు ఉంటాయి.

ఒక కప్పు వేగించిన వేరుశనగలో 166 కేలరీలు ఉంటే ఉడికించిన వేరుశనగలో 90 కేలరీలు ఉంటాయి. కాబట్టి ఉడికించిన వేరుశనగ తినటం వలన బరువు కూడా కంట్రోల్ లో ఉంటుంది. ఉడికించిన వేరుశనగల్లో ఫ్లేవనాయిడ్స్, పాలిఫెనాల్స్ సమృద్ధిగా ఉండుట వలన కణాల నష్టానికి కారణం అయినా ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. దీని వలన గుండె జబ్బులు మరియు మధుమేహం వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
gas troble home remedies
ఉడికించిన వేరుశనగలో ఫైబర్ కూడా సమృద్ధిగా ఉంటుంది. ఒక కప్పు ఉడికించిన వేరుశనగలో 2.5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఫైబర్ సమృద్ధిగా ఉన్న ఉడికించిన వేరుశనగలను తీసుకోవటం వలన ఆకలి కంట్రోల్ లో ఉంటుంది. అంతేకాక మలబద్దకం సమస్య కూడా తగ్గి పోతుంది. ఉడికించిన వేరుశనగలో మోనో శ్యాచురేటెడ్ ఫ్యాట్ ఉండుట వలన గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది.
ground nuts Benefits In telugu
అరకప్పు ఉడికించిన వేరుశనగలో 2 గ్రాముల న్యాచురల్ షుగర్,12గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. అసలు కొలస్ట్రాల్ ఉండదు. కాబట్టి మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనానికి మధ్యలో ఉడికించిన వేరుశనగలను తీసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలు అందటమే కాకుండా ఎనర్జీగా ఉండేలా చేస్తుంది.
Top 10 iron rich foods iron deficiency In Telugu
ఉడికించిన వేరుశనగలో ఉండే విటమిన్ B ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో సహాయపడుతుంది. ఉడికించిన వేరుశగనలో ఉండే పోషకాలు మెదడు, కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. మెదడు చురుగ్గా పనిచేయడానికి సహాయపడతాయి. అరకప్పు ఉడికించిన వేరుశగనల్లో 30 శాతం మెగ్నీషియం ఉంటుంది.

మెగ్నీషియం కండరాలు, నరాల పనితీరుకి సహాయపడతాయి. అలాగే ఆహారాన్ని ఎనర్జీగా మార్చే ప్రక్రియలో కూడా సహాయపడుతుంది. ఇందులో ఉండే మినరల్స్ ఎముకలు, పళ్లను బలంగా ఉండేలా చేస్తాయి. కాబట్టి మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.