Healthhealth tips in telugu

కొబ్బరి నీళ్లు త్రాగుతున్నారా… అయితే ఈ నిజాన్ని తెలుసుకోండి

Cococnut Water Benefits in telugu :వేసవిలో కూల్ డ్రింక్స్ త్రాగటానికి బదులు కొబ్బరి నీళ్లు త్రాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎన్నో ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. అలాగే వేసవి దాహాన్ని తీరుస్తుంది. ఎన్ని కొబ్బరినీళ్లను త్రాగిన శరీరంలో కొవ్వు పెద్దగా చేరదు. ఒక కొబ్బరిబోండాం ఒక సెలైన్ బాటిల్ తో సమానం. లేత కొబ్బరి బొండాల్లో 90 నుంచి 95 శాతం నీరు, 24 కేలరీల శక్తి ఉంటుంది. 100 గ్రాముల కొబ్బరి నీటి నుంచి 17.4 క్యాలరీల ఎనర్జీ లభిస్తుంది.ఎండాకాలంలో శరీరంలోని నీరు చెమట రూపంలో బయటికి వెళ్లిపోతుంది.

అలాంటి సమయంలో ఎక్కువగా ద్రవాలను తీసుకోవాలి. అప్పుడు దీంతో మన శరీరంలో నీటి నిల్వలు తగ్గకుండా ఉంటాయి. ముఖ్యంగా కొబ్బరినీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. వేసవిలో కొబ్బరినీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల అలసిన శరీరానికి తిరిగి ఉత్తేజం వస్తుంది. కొబ్బరి నీటిలో ప్రోటీన్స్, కొవ్వు, పిండిపదార్థాలు, డైటరీ ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి.

ఒక గ్లాసు కొబ్బరి నీటిలో 2 టీ స్పూన్స్ నిమ్మరసం కలిపి త్రాగితే శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ సమతుల్యమవుతాయి.కొబ్బరినీళ్లు తాగడం గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. హార్ట్ పేషెంట్స్ కొబ్బరి నీటిని రెగ్యులర్ గా త్రాగితే మంచిది. ముఖ్యంగా వేసవిలో హార్ట్ పేషంట్స్ కొబ్బరి నీటిని త్రాగాలి. కొబ్బరి నీళ్లలో ఉండే పోషకాలు మూత్రనాళ ఇన్ఫెక్షన్లని తగ్గిస్తాయి.

కొబ్బరినీరు రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. కొబ్బరి నీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన కాలేయంలోని టాక్సిన్లని అరికడతాయి. కిడ్నీలోని రాళ్లను కరిగించే లక్షణాలు కొబ్బరినీళ్లలో సమృద్ధిగా ఉన్నాయి. అలాగే కిడ్నీలో వ్యర్ధాలను బయటకు పంపటంలో సహాయాపడుతుంది. కొబ్బరి బోండాలు రెగ్యులర్‌గా తాగితే అధికబరువు అదుపులోకి వస్తుంది.