June 3 రాశి ఫలాలు…ఈ రాశుల వారు సహనంగా ఉండాలి

Mulugu Rasi Phalalu today :మేష రాశి
ఈరోజు ఆర్థిక వ్యవహారాలు బాగానే ఉంటాయి కొత్తవారితో పరిచయం పెరుగుతుంది ఆలయాల సందర్శన ఉంటుంది. వ్యాపారం బాగుంటుంది పశుపక్ష్యాదులకు తాగటానికి నీటిని ఏర్పాటు చేస్తే మంచి జరుగుతుంది

వృషభ రాశి
ఈ రోజు కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది వ్యాపారస్తులు ఉద్యోగస్తులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి కాస్త కష్టంగా ఉంటుంది సన్నిహితులతో మాట పట్టింపు వస్తుంది. విష్ణు సహస్రనామం చదివితే మంచి ఫలితాలు వస్తాయి

మిధున రాశి
చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు వ్యాపారం ఉద్యోగం బావుంటుంది ఆదాయం పెరుగుతుంది శని ప్రభావం ఉండటం వలన కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను పెట్టాలి

కర్కాటక రాశి
ఈరోజు హలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వ్యాపారం లేదా ఉద్యోగం చాలా సంతృప్తికరంగా ఉంటుంది ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి

సింహరాశి
దైవ చింతన ఎక్కువగా ఉంటుంది వ్యాపారం లేదా ఉద్యోగం లో కొన్ని చికాకులు ఉంటాయి పనుల్లో జాప్యం ఎక్కువగా జరుగుతుంది కాబట్టి కాస్త సహనం ఉండాలి. పశుపక్ష్యాదులకు తాగటానికి నీటిని ఏర్పాటు చేస్తే మంచి కలుగుతుంది

కన్యారాశి
పాత స్నేహితులు కలుస్తారు బంధువులతో సరదాగా గడుపుతారు ఉద్యోగం విషయంలో మంచి శుభవార్త వింటారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

తులారాశి
ఇల్లు కట్టాలని ప్రయత్నం సఫలం అవుతుంది చేతిలో డబ్బు సమృద్ధిగా ఉంటుంది విద్యార్థులు కాస్త కష్టపడాల్సి ఉంటుంది వివాదాలకు దూరంగా ఉండండి

వృశ్చిక రాశి
అనుకున్న పనులు చాలా వరకు పూర్తి అవుతాయి విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు రాశి
వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి కొత్త స్నేహితులు పరిచయం అవుతుంది విద్యార్థులు కాస్త కష్టపడితే మంచి ఫలితం కలుగుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి కూడా మంచి శుభవార్త వినే అవకాశం ఉంది.

మకర రాశి
వీరు ఎంత శ్రమ పడితే అంత ఫలితం కనబడుతుంది తీర్థయాత్రలకు ప్రణాళిక వేస్తూ ఉంటారు విద్యార్థులకు అన్ని విధాలా బాగుంటుంది వివాదాలకు చాలా దూరంగా ఉండాలి.

కుంభరాశి
ఉద్యోగస్తులు మంచి అనుకూలమైన సమాచారాన్ని వింటారు శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది విద్యార్థులు చాలా శ్రమ పడాలి శివ ఆరాధన మంచిది.

మీన రాశి
దేవుని పట్ల భక్తి పెరుగుతుంది విద్యార్థులకు చాలా బాగుంటుంది డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.