పరగడుపున 4 కరివేపాకు ఆకులను తింటే ఊహించని లాభాలు

Curry Leaves Benefits in telugu :మన భారతదేశంలో కరివేపాకును ఎక్కువగా ఉపయోగిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరికీ కరివేపాకు గురించి తెలుసు. కరివేపాకును వంటల్లో వేయటం వలన వంటకు రుచి,వాసన వస్తుంది. కరివేపాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనలు దాగి ఉన్నాయి. ఆ ప్రయోజనాల గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడాలి. రుటేషియ కుటుంబానికి చెందిన కరివేపాకు శాస్త్రీయ నామం ముర్రయ కియినిగి. కరివేపాకు ఎక్కువగా భారతదేశంలో పండిస్తారు. భారతదేశంలో కాకుండా, కరివేపాకును చైనా, ఆస్ట్రేలియా, సిలోన్ మరియు నైజీరియాల్లో ఎక్కువగా పండిస్తారు.

కరివేపాకు చాలా విరివిగా దొరకటమే కాకుండా చాలా చౌకగా లభిస్తుంది. అందువల్ల ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. కరివేపాకు వంటల్లోనే కాకుండా వివిద రకాలుగా కూడా ఉపయోగిస్తున్నారు. కరివేపాకును స్వీట్ నీమ్ అని కూడా పిలుస్తారు. చాలా మంది కూరల్లో వేసే కరివేపాకును ఏరి పడేస్తూ ఉంటారు. అలాంటి వారు ఈ వీడియో చూస్తే తప్పకుండా పాడేయకుండా తినటం అలవాటు చేసుకుంటారు. ఇప్పుడు కరివేపాకు వలన ఎన్ని ప్రయోజనలు ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.

జీర్ణశక్తిని పెంచటంలో కరివేపాకు బాగా సహాయపడుతుంది. అలాగే శరీరంలో చెడు కొలస్ట్రాల్ ని తొలగించటంలో కూడా సహాయపడుతుంది. కరివేపాకు జీర్ణశక్తిని పెంచి బరువును తగ్గించటానికి సహాయపడుతుంది. ప్రతి రోజు ఒక గ్లాస్ మజ్జిగలో ఒక స్పూన్ కరివేపాకు పేస్ట్ వేసి బాగా కలిపి త్రాగితే బరువు తగ్గవచ్చు.

కరివేపాకులో యాంటీఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన యూరిన్ మరియు బ్లాడర్ సమస్యలను నివారిస్తుంది. కరివేపాకుతో తయారుచేసిన జ్యూస్ లో కొంచెం దాల్చిన చెక్క పొడి చేర్చి తాగడం వల్ల యూరినరీ సమస్యలు చాలా సమర్ధవంతంగా తగ్గించుకోవచ్చు .ఈ రోజుల్లో మధుమేహం ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. కరివేపాకులో యాంటీహైపర్ గ్లిసమిక్ సహజంగా ఉండుట వలన ప్రధానమైన రక్త నాళాల్లో గ్లోకోజ్ ను కంట్రోల్ చేస్తుంది.కాబట్టి ప్రతి రోజు ఉదయం పరగడుపున నాలుగు కరివేపాకులను తింటే మధుమేహం అదుపులో ఉంటుంది.

గర్భదరణ సమయంలో ఉండే మార్నింగ్ సిక్ నెస్, వాంతులు, వికారం వంటి వాటికి కరివేపాకు ఉపశమనం కలిగిస్తుంది. ఉదయం లేవగానే 4 కరివేపాకు ఆకులను తింటే ఈ సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. కరివేపాకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండుట వలన ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది. ఇన్ఫ్లమేషన్ కు గురైన చర్మానికి కరివేపాకును రాయటం వలన మంచి రిజల్ట్ పొందవచ్చు.

కరివేపాకులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి రెగ్యులర్ డైట్ లో కరివేపాకును చేర్చుకుంటే కంటికి సంబందించిన సమస్యలను నివారించవచ్చు.రెగ్యులర్ డైట్ లో కరివేపాకు చేర్చుకోవడం వల్ల కాంట్రాక్ట్ ను నివారించుకోవచ్చని ఈ మధ్య కాలంలో జరిగిన పరిశోధనల్లో వెల్లడైనది. కరివేపాకు పేస్ట్ కి కొంచెం పసుపు కలిపి చర్మ సమస్యలు ఉన్న ప్రదేశంలో రాస్తే స్కిన్ ఇరిటేషన్స్ తగ్గుతాయి. ఒక గ్లాస్ మజ్జిగలో ఒక స్పూన్ కరివేపాకు పేస్ట్ వేసి బాగా కలిపి ఉదయం,సాయంత్రం త్రాగితే కొలస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. అంతేకాక అనీమియా కూడా తగ్గుతుంది. కరివేపాకులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది బ్లడ్ లో ఐరన్ ను ప్రోత్సహిస్తుంది. ఆక్సిజన్ సప్లై చేయడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.