జుట్టు రాలే సమస్యను తగ్గించటమే కాకుండా తెల్లజుట్టును నల్లగా మార్చుతుంది

Hair Fall Tips In telugu :ఈ రోజుల్లో మనలో చాలా మందికి జుట్టు రాలిపోవటం అలాగే తెల్లజుట్టు సమస్య అనేవి చాలా చిన్న వయస్సులోనే వచ్చేస్తున్నాయి. దాంతో కంగారు పడిపోయి మార్కెట్ లో దొరికే అనేక రకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. అవి తాత్కాలికంగా పనిచేసిన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంటి చిట్కాల ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు రాలే సమస్య నుండి బయట పడవచ్చు. అంతేకాక తెల్లజుట్టు నల్లగా మారుతుంది.

ముందుగా పొయ్యి మీద బాణలి పెట్టి దానిలో ఆవనూనె,కరివేపాకు ఆకులు,మెంతులు వేసి పది నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత ఆ నూనెను వాడకత్తి నిల్వ చేసుకోవాలి. వారంలో 2 సార్లు తలకు పట్టించి అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి.

ఈ విధంగా చేస్తూ ఉంటే క్రమంగా జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది. అలాగే తెల్లజుట్టు కూడా నల్లగా మారిపోతుంది. ఈ చిట్కా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. దీనికి వాడిన పదార్ధాలు అన్నీ సహజసిద్దమైనవి. అలాగే అన్నీ మన ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేవే. కాబట్టి ఈ చిట్కాను ట్రై చేయండి.