కరోనా తర్వాత జుట్టు రాలే సమస్య ఎక్కువ అయిందా…ఇలా చెక్ పెట్టండి

Hair Fall Tips in Telugu :కరోనా వైరస్ గత సంవత్సరం మార్చి నుండి ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుంది. చాలా మంది ప్రాణాలను కోల్పోయారు. కొంత మంది కరోనా బారి నుండి బయట పడిన కొన్ని సమస్యలు మాత్రం అలానే ఉండిపోతున్నాయి. అలాంటి వాటిలో జుట్టు రాలిపోవటం అనేది ఒకటి. జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవాలంటే మంచి పోషకాహారం తీసుకుంటూ ఇప్పుడు చెప్పే ప్యాక్ వేసుకుంటే జుట్టు రాలే సమస్య నుంచి బయట పడవచ్చు.

ఈ ప్యాక్ కి కావలసిన పదార్ధాలు,ఎలా తయారుచేయాలి. ఎలా ఉపయోగించాలి వంటి విషయాలను తెలుసుకుందాం. ఈ ప్యాక్ కి అవసరం అయిన అన్నీ వస్తువులు ఇంటిలో అందుబాటులో ఉందేవే.

కావలసిన పదార్ధాలు
బాగా పండిన అరటిపండు – సగం
గుడ్డు పచ్చ సోన
తేనే – 1 స్పూన్

ఒక బౌల్ లో అరటిపండును మెత్తగా చేసి దానిలో గుడ్డు పచ్చ సొన,తేనే వేసి బాగా కలిసేలా కలపాలి. ఈ మిశ్రమాన్ని తల మీద చర్మం మీద రాసి మూడు గంటల పాటు ఆలా వదిలేసి చల్లని నీటితో శుభ్రంగా కడగాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.