బాదం ఎలా తీసుకుంటే బరువు తగ్గుతారో తెలుసా…అసలు నమ్మలేరు

Almond Benefits in telugu : ఈ రోజుల్లో వయస్సుతో సంబందం లేకుండా ప్రతి ఒక్కరూ అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య నుంచి చాలా సులువుగా బయట పడవచ్చు. అయితే కాస్త ఓపికగా చేయాలి. సన్నగా,నాజుగ్గా ఉండాలని కోరుకుంటుంది ఏ అమ్మాయేనా. అయిన అనుకోకుండా పెరిగిన బరువును వ్యాయామంతో తగ్గించుకోవటానికి ప్రత్యేకంగా సమయం కేటాయించలేని వారు చాలా మందే ఉంటారు.

అలాంటి వారి కోసం బాదాం పలుకులు చాలా మంచి ప్రత్యమ్నాయం. బరువును తగ్గించటంలో బాదం ముందుతుంది. విటమిన్స్,ఖనిజాలు మరియు ఆరోగ్యానికి ఉపయోగపడే కొవ్వు కలిగిన బాదం పలుకులను తింటే కార్బో హైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న పదార్దాలను తినాలన్నా ఆసక్తి తగ్గుతుంది.

ఇలా కొన్ని నెలల పాటు కార్బో హైడ్రేట్ల వినియోగం తగ్గిస్తే అదనపు కొవ్వు దానికి అదే కరుగుతుంది. అలాగే కొవ్వు కూడా పట్టదు. కనుక రెండు రోజులకు ఒకసారి గుప్పెడు బాదం పప్పులను తింటూ ఉండాలి. వీటిలో మాంగనీస్,కాపర్,మెగ్నీషియం, బి కాంప్లెక్స్ విటమిన్స్ అయిన నియాసిన్,బయోటిన్ వంటివి పుష్కలంగా ఉంటాయి.

ఇవి శరీరంలో శక్తి పెరగటానికి సహాయపడతాయి. దీని వల్ల శరీరం చురుకుగా ఉండి ఏదో ఒక పనిలో నిమగ్నం అవుతారు. దీని వలన కేలరీలు కరుగుతాయి. కనుక సాదారణ బరువుని మించి ఉన్నవారు బరువు తగ్గటానికి బాదం పలుకులను వినియోగించుకోవచ్చు.