Healthhealth tips in telugu

పుట్టగొడుగుల‌ను రెగ్యుల‌ర్‌గా తింటే ఏం అవుతుందో తెలుసా?

Mushroom Health benefits in telugu : మహిళలు తప్పనిసరిగా పుట్టగొడుగులు తినాలని సూచిస్తున్నారు వైద్యులు.. పుట్టగొడుగుల్లోని మ్యాజిక్ మష్రూమ్ అనే ఓ రకం మహిళల్లో తరచుగా వచ్చే ఒత్తిడిని దూరం చేస్తుంది. సిలోసైబిస్, సిలోసిస్ మనోధర్మి సమ్మేళనాలు కలిగి ఉండే పుట్టగొడుగుల్నే మ్యాజిక్ మష్రూమ్ అంటారు.

మెదడులోని నాడీ ప్రసారాన్ని ప్రభావితపర్చే సామర్థ్యాన్ని కలిగి ఉండి సైకోథెరపీ ప్రయోజనాలను కలిగిస్తుంది. ఈ మష్రూమ్స్ లో ఫొటో ట్రోపిక్ కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితపర్చి ఒత్తిడిని దూరం చేస్తుంది.

ఇక పుట్టగొడుగులు అన్ని రకాలూ రక్తహీనతను దూరం చేస్తాయి. మధుమేహాన్ని నియంత్రిస్తాయి. హైబీపీని కంట్రోల్ చేసి రక్తనాళాల్లోని కొవ్వును తొలగిస్తాచి. వారంలో 4రోజులు చొప్పున 4వారాల పాటు మష్రూమ్స్ తింటే పోషకలేమిని తొలగించుకోవచ్చు. ఇందులో పీచు, విటమిన్లు అధికంగానూ.. అమినో యాసిడ్స్, కొవ్వు, పిండి పదార్థాలు తక్కువ స్థాయిలో ఉంటాయి. పుట్టగొడుగుల్లో కూరగాయలు, పండ్ల కంటే ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఎముకల పటిష్టతకు కీలకమైన ఫోలిక్ యాసిడ్, కాల్షియం, అలాగే ఐరన్, పాస్పరస్ సమృద్ధిగా దొరుకుతాయి.

షుగర్ పేషంట్లకు మష్రూమ్స్ దివ్యౌషదం.
ఇవి పీచును కలిగి ఉండడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. మోకాళ్ల నొప్పులు దూరం చేస్తాయి. సంతానలేమి, మహిళల గర్భ సంబంధిత వ్యాధులను నయం చేస్తాయి. తరచుగా మష్రూమ్ సూప్ తీసుకుంటే మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ ను దూరం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.