అలనాటి హీరోయిన్ కవిత ఇంటిలో తీవ్ర విషాదం

Kavitha Son Death : కరోనా వైరస్ సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. గత 18 నెలలుగా ఈ వైరస్ ప్రతి ఒక్కరిని భయపెడుతుంది. ఈ కరోనా వైరస్ సినీ పరిశ్రమలో హాలీవుడ్ బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ అన్ని చిత్ర పరిశ్రమలను వణికిస్తోంది.

అసలు విషయం లోకి వస్తే 1990లో లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన సీనియర్ నటి కవిత ఇంట్లో కరోనా కలకలం సృష్టించింది. కవిత కొడుకు సంజయ్ కరోనాతో పోరాడుతూ తుది శ్వాస విడిచారు. కవిత భర్త కరోనాతో హాస్పటల్ లో గత కొన్ని రోజులుగా చికిత్స తీసుకుంటున్నారు. కవిత చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం కవిత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్నారు.