ఉపాసన,చరణ్ మొదటి పరిచయం ఎక్కడో తెలుసా?

Ram Charan And Upasana :మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా చిరుత మూవీతో ఇండస్ట్రీకి వచ్చిన రామ్ చరణ్ తన నటనతో ఫాన్స్ కి దగ్గరై, మెగా పవర్ స్టార్ గా ఎదిగాడు. విభిన్న సినిమాలు చేస్తూ,మరోపక్క తండ్రితో సినిమాలు నిర్మిస్తూ,ఇంకోపక్క వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతూ చెర్రీ దూసుకుపోతున్నాడు. అపోలో కంపెనీ వైస్ చైర్మన్ హోదాలో ఉండే ఉపాసనను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు.

ఎస్ ఎస్ రాజమౌళి తీసిన మగధీర మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన రామ్ చరణ్ ఈ మధ్య రంగస్థలం మూవీతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసాడు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తో కల్సి రాజమౌళి డైరెక్షన్ లో ఆర్ ఆర్ ఆర్ మల్టీస్టారర్ మూవీలో నటిస్తున్నాడు. అలాగే మెగాస్టార్ తో ఆచార్య మూవీ నిర్మిస్తూ,అందులో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

ఇంతకీ ఉపాసనతో ప్రేమకు బీజం ఎక్కడ పడిందంటే స్పోర్ట్స్ క్లబ్ మీటింగ్ లో.అలా అప్పుడు తొలిచూపులోనే ఒకరికొకరు ఇష్టపడ్డారు. తర్వాత ఐదేళ్లపాటు తరచూ పలుచోట్ల కలుసుకుంటూ తమ ప్రేమను సాగించారు. అయితే వీరి ప్రేమ విషయం దగ్గర ఫ్రెండ్స్ కి కూడా తెలీకుండా జాగ్రత్త పడ్డారు. చివరకు పెద్దలను ఒప్పించి మరీ అంగరంగ వైభవంగా పెళ్లిచేసుకున్నారు. టాలీవుడ్ లో క్యూట్ కపుల్స్ లో ఒకరిగా ముద్రపడ్డ ఈ జంటకు పెళ్లి జరిగి తొమ్మిదేళ్లు పూర్తయిపోవడం విశేషం.