సూర్య వెబ్ సిరీస్ ముగింపుపై ఊహాగానాలు…అభిమానులకు నిరాశ…!?

surya web series Shanmukh Jaswanth :ఒకప్పుడు ఏమోగానీ కరోనా నేపథ్యంలో సినిమా హాల్స్ లేకపోవడంతో టివిలు చూడడం, ఇంటర్నెట్ వాడకం ఎక్కువైంది. దీంతో సోషల్ మీడియాలో వచ్చే వినోద కార్యక్రమాలు ముఖ్యంగా ఓటిటి ఫ్లాట్ ఫార్మ్ మీద వచ్చే మూవీస్ కి డిమాండ్ పెరిగింది. ఇక యూట్యూబ్ లో వచ్చే కార్యక్రమాలు, వెబ్ సిరీస్ బాగానే ఆకట్టు కుంటున్నాయి. టాలెంట్ నిరూపించుకోడానికి యూట్యూబ్ వేదిక అవుతోంది. దీంతో పలువురు వెబ్ సిరీస్ లో నటిస్తూ తమ సత్తా చాటుతున్నారు. ఇదే కోవలో షణ్ముఖ్ జస్వంత్ ఇప్పుడు పాపులర్ గా మారాడు. ఒకప్పుడు యూట్యూబ్ లోనే సాదా సీదా కామెడీ స్కిట్స్,ఇమిటేషన్ డాన్సులు చేసే యితడు ఇప్పుడు సూర్య వెబ్ సిరీస్ తో స్టార్ స్టేటస్ కి వచ్చేసాడు.

ఒక సాఫ్ట్ వేర్ డెవలపర్ గా షణ్ముఖ్ కెరీర్ స్టార్ట్ కావడం,అనూహ్యంగా సూర్య వెబ్ సిరీస్ తో టాప్ లెవెల్ కి చేరాడు. ఇతనికి సోషల్ మీడియాలో 3.5 మిలియన్ల ఫాలోయర్స్ ఉన్నారు. ఇప్పటికే షణ్ముఖ్ నటించిన సాఫ్ట్ వేర్ డెవలపర్ సిరీస్ తో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. ఇక సూర్య వెబ్ సిరీస్ లో నటిస్తూ, సంచలనా లను క్రియేట్ చేస్తున్నాడు. సూర్య వెబ్ సిరీస్ ఇప్పటికే 7 ఎపిసోడ్స్ విడుదలై యూట్యూబ్ లో నెంబర్ వన్ కి చేరింది. ఇప్పుడు ఎనిమిదో ఎపిసోడ్ విడుదలై యూట్యూబ్ లో నెంబర్ వన్ గా ట్రెండింగ్ లో ఉంది. ఇంజనీరింగ్ పూర్తయి ఖాళీ ఖాళీగా ఉంటూ ఉద్యోగం లేకుండా ఫ్రెండ్స్ తో తిరగే ఓ మధ్య తరగతి కుర్రాడిగా సూపర్ డూపర్ గా షణ్ముఖ్ నటించి మెప్పించాడు.

ఫ్యామిలీ ఓరియెంటెడ్ గా వస్తున్న ఈ వెబ్ సిరీస్ లో షణ్ముఖ్ సరసన మౌనిక రెడ్డి చేసింది. ఈ సిరీస్ లో లాస్ట్ ఎపిసోడ్ లో ఒక అనుకోని ట్విస్ట్ ఉందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సినిమాలు, సీరియల్స్ మాదిరిగానే లీకులు బయటకొస్తున్నాయి. సాఫ్ట్ వేర్ డెవలపర్ తరహాలోనే, సూర్య వెబ్ సిరీస్ కూడా ఓ సాడ్ ఎండింగ్ తో ముగుస్తుందట. చివరి ఎపిసోడ్ ఫ్యాన్స్ ను షణ్ముఖ్ కంటతడి పెట్టిస్తాడట. సూర్య,అంజలి పాత్రల మధ్య బ్రేకప్ సీన్ ఉంటుందట. నానా కష్టాలు పడి,సూర్య ఉద్యోగం సంపాదించి, స్థిరపడే సమయంలో అంజలితో వచ్చే ఓ చిన్న అపోహ వలన ఇద్దరు విడిపోతారట. ఈ నిజం తెలిసేలోగా అంజలికి వేరొకరితో పెళ్లవు తుందట. మొత్తం మీద విషాదంతో ఈ వెబ్ సిరీస్ ముగుస్తుందని టాక్.