అరటిపండు తిని తొక్క పాడేస్తున్నారా…. ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో…?

Banana Peel benefits In telugu :మ‌న‌కు అర‌టిపండ్లు ఏడాది పొడవునా ల‌భిస్తాయి. పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు కూడా అర‌టిపండ్లు అందుబాటులో ఉంటాయి. ఎవ‌రికైనా వీటిని చూడ‌గానే తినాల‌ని అనిపిస్తుంది. మనలో చాలా మంది అరటిపండు అంటే చాలా ఇష్టంగా తింటారు. కొంతమంది పెద్దగా ఇష్టపడరు. అయితే ఎక్కువ మంది అరటిపండును తినటానికి ఎక్కువ ఇష్టం చూపుతారు. అరటిపండులో కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయి. అరటిపండు తిని అందరు కామన్ గా తొక్కను పాడేస్తారు. తొక్కే కదా అని తీసిపాడేసే తొక్కలో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చాలా మందికి తెలియదు.

అరటిపండు తొక్కలో ఎన్నో ఆరోగ్య,బ్యూటీ ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తే తొక్కే కదా అని పాడేసే వారు పాడేయరు. అరటిపండు తొక్కలో సేరోటినీన్ ఉండుట వలన మూడ్ మీద ప్రభావం చూపి డల్ గా లేకుండా ఉషారుగా ఉండేలా చేస్తుంది. అరటిపండులో కన్నా అరటి తొక్కలోనే ఎక్కువ పీచు పదార్ధాలు ఉన్నాయి. ఈ పీచు కొవ్వు పదార్ధాల స్థాయిలను తగ్గించి గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. పొటాషియం  సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో ఆమ్ల నియంత్రణను బ్యాలెన్స్ గా సాగిస్తుంది.

అంతేకాక రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. అరటిపండు తొక్కలో  ట్రిప్టోఫాన్ మరియు అమైనో ఆమ్లం సమ్మేళనం ఉండటం వలన రాత్రి సమయంలో నిద్ర బాగా పడుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు రాత్రి పడుకొనే ముందు అరటిపండుతో పాటు అరటిపండు తొక్కను కూడా తినాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తూ ఉంటే  నిద్రలేమి సమస్య దూరం అవుతుంది.  అరటితొక్కలో లుటీన్ సమృద్ధిగా ఉండటం వలన కంటిచూపు బాగా కనిపించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో కంటిచూపు మెరుగుదల ఉంటుంది. దంతాల సంర‌క్ష‌ణ‌కు అర‌టి పండు తొక్క బాగా సహాయపడుతుంది. అర‌టి పండు తొక్క లోప‌లి భాగాన్ని దంతాల‌పై రోజూ రుద్దాలి.

క‌నీసం ఇలా వారం పాటు చేస్తే దంతాలు తెల్ల‌గా మెరుస్తాయి. కాలిన గాయాలు, దెబ్బ‌ల‌కు అర‌టి పండు తొక్క దివ్య  ఔష‌ధంగా ప‌నిచేస్తుంది. స‌మ‌స్య ఉన్న ప్రాంతంపై అర‌టి పండు తొక్క‌ను ఉంచి క‌ట్టు క‌ట్టాలి. రాత్రంతా దాన్ని అలాగే ఉంచాలి. రోజూ రాత్రి ఇలా చేస్తే ఒక‌టి, రెండు రోజుల్లోనే దెబ్బ‌లు మానిపోతాయి. అరటిపండు తొక్కలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఏజింగ్ గుణాలు సమృద్ధిగా ఉండుట వలన చర్మ సంరక్షణలో బాగా సహాయ పడుతుంది.

అర‌టి పండు తొక్క లోపలి భాగాన్ని ముఖంపై రుద్ది అర‌గంట సేపు ఆగాక గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని క‌డిగేయాలి. ఈ విధంగా చేయటం వలన  వృద్ధాప్యం కార‌ణంగా వ‌చ్చే ముడ‌త‌లు తగ్గి ముఖం కాంతివంతంగా మారుతుంది. చ‌ర్మంపై ఏర్ప‌డే దుర‌ద‌లు, మంట‌ల‌ను త‌గ్గించ‌డంలోనూ అర‌టి పండు తొక్క ఉప‌యోగ‌ప‌డుతుంది. స‌మ‌స్య ఉన్న ప్ర‌దేశంపై అర‌టి పండు తొక్క‌ను రాసి 10 నిమిషాలు ఆగాక క‌డిగేయాలి. దీంతో దుర‌ద‌, మంట త‌గ్గిపోతుంది.