పరగడుపున వెల్లుల్లి తింటున్నారా…. ఈ నిజాలు తెలిస్తే…!?

Garlic Health benefits In telugu :వెల్లుల్లి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది ప్రతి ఒక్కరి ఇంటిలోనూ ఉంటుంది. వెల్లుల్లి వంటలకు మంచి రుచిని ఇవ్వటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. వెల్లుల్లిని ఒక శక్తివంతమైన యాంటీ బయోటిక్ గా పనిచేస్తుంది. అలాగే కొన్ని ప్రత్యేకమైన ఔషధ గుణాలు ఉన్నాయి. వెల్లుల్లిని ఆయుర్వేద ఔషదాల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎన్నో వ్యాధుల పరిష్కారానికి వెల్లుల్లి సహాయపడుతుంది. వెల్లుల్లి శాస్త్రీయ నామము ” అల్లియమ్ సాటివుమ్(allium sativum)”, వెల్లుల్లిలో సల్ఫర్ కంటెంట్ ఎక్కువ ఉండుట వలన  ఘాటైన వాసన వస్తుంది. రిల్లీ కుటుంబానికి చెందిన ఈ వెల్లుల్లిల  ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. 

విటమిన్‌- సి, బి6, సెలీనియమ్‌, జింక్‌, కాల్షియమ్‌, పొటాషియమ్‌ వంటివి సమృద్ధిగా ఉన్నాయి. వెల్లుల్లిని ఉదయం సమయంలో పరగడుపున తింటే మరింత శక్తివంతంగా, సహజ యాంటీ బయాటిక్ గా పని చేస్తుందని ఇటీవల జరిగిన పరిశోధనల్లో తేలింది. ఉదయాన్నే పరగడుపున బ్రేక్ ఫాస్ట్ కి ముందు తినటం వలన వెల్లుల్లిలోఉండే  యాంటీ బయాటిక్ గుణాలు, జీర్ణాశయంలో ఉండే హానికరమైన బ్యాక్టీరియాలను నాశనం చేస్తాయి. వెల్లుల్లిలో ఉండే రసాయనాన్ని అల్లిసిన్ అని అంటారు. ఈ అల్లిసిన్ రసాయనం కారణంగానే వెల్లుల్లికి ఆ వాసన,ఘాటు వచ్చింది.

అల్లిసిన్ అనే రసాయనం శరీరంలో అనేక ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తుంది. ఉదయం పరగడుపున వెల్లుల్లిని తింటే రక్త ప్రసరణ మెరుగుపడి రక్తపోటు నియంత్రణలో ఉంటుంది , అలాగే నాడీ సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుంది. వెల్లుల్లి ఒత్తిడి తగ్గించటంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. మీరు ఒత్తిడికి గురైనపుడు, కడుపులో ఆసిడ్ లు అధిక మొత్తంలో విడుదల అవుతాయి, 
అలాంటి సమయంలో వెల్లుల్లి ఈ ఆసిడ్ ల స్థాయిలను తగ్గించి, ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తుంది.

వెల్లుల్లి శరీర రోగనిరోధక సామర్థ్యాన్నిపెంచి  బ్యాక్టీరియా మరియు ఫంగస్ ల ఇన్ఫెక్షన్ ల నుండి పూర్తిగా ఉపశమనాన్ని కలిగిస్తుంది. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణాలు వెల్లుల్లిలో ఉన్నాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. రక్తనాళాల్లో ఉండే కొవ్వు కరిగిపోతుంది. ఆ నాళాల్లో ఉండే ఆటంకాలు తొలగిపోయి రక్త ప్రసరణ బాగా సాగి గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. దగ్గు, జలుబు, జ్వరం, ముక్కు దిబ్బడ,శ్వాస సంబంధ సమస్యలు తొలగిపోతాయి.