స్నేహం కోసం సినిమా గురించి నమ్మలేని నిజాలు…అసలు నమ్మలేరు

Sneham Kosam Full Movie :డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులు సృష్టించిన సూపర్ కృష్ణ, స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి కాంబినేషన్ అంటే నిజంగా ఆసక్తికరంగానే ఉంటుంది. చిరంజీవి ఎదుగుతున్న సమయంలో కొత్త అల్లుడు, కొత్తపేట రౌడీ మూవీస్ లో కృష్ణతో కల్సి నటించగా, వాటిల్లో విలన్ గా చేసాడు. అయితే చిరు ఒక రేంజ్ కి చేరుకున్నాక కృష్ణతో కల్సి నటించిన మూవీ తోడుదొంగలు. ఎదుటి విజయాన్ని ఒప్పు కోవడంతో,ఉన్నది ఉన్నట్టు చెప్పే మనస్తత్వం కృష్ణది. అపజయాన్ని ఈజీగా ఒప్పుకుంటారు.

దాదాపు చిరంజీవి కూడా ఇదే మనస్తత్వం గల వ్యక్తి. అరమరికలు లేకుండా మాట్లాడతారు. ఖైదీ మూవీతో స్టార్ ఇమేజ్ రావడం వలన కృష్ణ, చిరంజీవి కల్సి నటించే సందర్భం కూడా పెద్దగా రాలేదు. తోడు దొంగలు తర్వాత 18ఏళ్లకు ఇద్దరూ కల్సి నటిస్తున్నట్లు వార్తలు వచ్చినా అది వాస్తవ రూపం దాల్చలేదు. తమిళంలో నట్పుకాగా అనే మూవీలో శరత్ కుమార్ డ్యూయెల్ రోల్ చేయగా, ఆ మూవీ రీమేక్ లో నటించాలని చిరంజీవి భావించారు. తమిళంలో తీసిన ఏ ఎం రత్నం తెలుగులో చిరంజీవితో తీయాలని ముందుకొచ్చారు. తమిళంలో డైరెక్ట్ చేసిన కె ఎస్ రవికుమార్ నే ఇక్కడా డైరెక్టర్ గా తీసుకున్నారు.

ఇక తమిళంలో విజయకుమార్ వేసిన పాత్రను తెలుగులో ఎవరితో చేయించాలా అనే సందేహం వచ్చింది. దీంతో కృష్ణ పేరు విన్పించడం, ఇండస్ట్రీలో స్ప్రెడ్ అవ్వడం జరిగిపోయింది. అయితే ఓల్డ్ క్యారెక్టర్స్ చేయకూడదని కృష్ణ భావించడం, ఇక వారసుడు మూవీ సమయంలో కృష్ణ ఫాన్స్ చేసిన రగడతో ఏ ఎం రత్నం కూడా కృష్ణను ఎప్రోచ్ కాకపోవడంతో కార్యరూపం దాల్చలేదు. డాక్టర్ రాజశేఖర్ ని సంప్రదించగా, ఆయన ఒకే చెప్పారు. కానీ ఓల్డ్ క్యారెక్టర్స్ అప్పుడే వద్దని చిరంజీవి చెప్పడంతో వెనక్కి తగ్గారు. దాంతో తమిళంలో నటించిన విజయకుమార్ ని తీసుకున్నారు. స్నేహం కోసం టైటిల్ పెట్టారు. మీనా హీరోయిన్. చిరంజీవి ఓల్డ్ క్యారెక్టర్ కి మంచి పేరు వచ్చింది.