MoviesTollywood news in telugu

ఈ హీరోయిన్స్ ప్యాకప్ తర్వాత ఏమి చేస్తారో తెలుసా…అసలు నమ్మలేరు

Tollywood Heroines :నేటి హీరోయిన్స్,స్టార్స్ కూడా సినిమాల్లో బిజీబిజీగా ఉంటూనే సమాజంలో చైతన్య పరిచే మెసేజ్ లు అందిస్తున్నారు. ఇది స్ఫూర్తివంతంగా ఉందని కొందరు అంటుంటే,ముందు వాళ్ళు ఆలోచించి ఆతర్వాత జనానికి చెబితే మంచిదని కొందరు అంటున్నారు. ఎవరు ఏమి చేసినా చేయకపోయినా ఏదో ఒక కామెంట్ చేసేవాళ్ళు ఉండనే ఉంటారు.

నిజానికి సినిమా లో మేకప్,ఇంటికెళ్ళేముందు ప్యాకప్ అనేవిధంగా హీరోయిన్స్ ఉంటూ బయట ప్రపంచాన్ని అస్సలు పట్టించుకోరు. సినిమా చేశామా, పారితోషికం ముట్టిందా లేదా,ఒకవేళ సినిమాలు లేకపోతె బ్రాండ్ అంబాసిడర్ లుగా షాప్ ల ఓపినింగ్స్ చేశామా లేదా అని అనుకుంటారు. అయితే నేటి హీరోయిన్స్ సందేశాలు ఇవ్వడం లోనూ ముందుంటున్నారు. తాజాగా నీటి కాలుష్యంపై రేష్మిక ఫోటో షూట్ అందరినీ ఆలోచింపజేసేలా ఉంది.

ఒకప్పుడు మంచి నీటి సరస్సులా వుండే బెల్లందూర్ చెర్వు ఇప్పుడు మురికి కూపంగా మారిపోయింది. ఒక్కోసారి చుట్టూ మంటలు రేగుతూ విషం కక్కుతోంది. చుట్టూ ఉండే జనం అల్లాడి పోతున్నారు. దీనిపై ఎన్ని వార్తలు వచ్చినా పట్టించుకోరు. ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా ఉండదు. అయితే ఈ చెరువుపై గీత గోవిందం మూవీలో అలరించిన రష్మిక స్పందిస్తూ,జలకాలుష్యం పై చేసిన ఫోటో షూట్ పై చర్చ జోరుగా నడుస్తోంది. చెరువులు కాలుష్యం బారిన ఎలా పడుతున్నాయి,ప్లాస్టిక్ ఎంతటి అనర్ధాన్ని తెస్తోందో ఈ ఫోటో షూట్ చూపిస్తున్నాయి. ఇలాగే నిర్లక్ష్యం వహిస్తే చెరువులు చెత్తా చెదారంతో మురికి కూపాలను తలపిస్తాయని అప్పుడు నీటికి కటకట ఎదుర్కోవాల్సి వస్తుందని రష్మిక అంటోంది.

ఇక కన్నడ నటి సోనో గౌడ్ అయితే రోడ్లపై గుంతలు ఉండడంపై సీరియస్ గా స్పందించింది. ఎందుకంటే బెంగుళూరులో రోడ్డుపై గుంతలు కారణంగా ప్రయాణికుల ప్రాణాలు పోతున్నాయి. దీన్ని గుర్తించిన సోనో, రోడ్డుపై గుంతలున్నచోట సరస్సులా చేసి,జలకన్యలా కూర్చుని జనం అవస్థలను గుర్తుచేస్తూ వినూత్న నిరసన తెల్పింది. దీంతో అధికారులు ఆఘమేఘాల మీద స్పందించారు.

ఇక జంతువులంటే ప్రాణంగా భావించే నటి త్రిష, పెట్ ఆన్ గుడ్ విల్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తోంది. జంతువులకు హాని జరిగితే ఈమె తట్టుకోలేదు. అందుకే ప్రతి ఒక్కరూ ఓ సాధు జంతువుని దత్తత తీసుకోవాలని చెబుతుంది. అయితే తమిళనాట జల్లికట్టుపై ఆమె చేసిన వ్యాఖ్యలతో ఆమెను కొందరు టార్గెట్ చేసారు. దీంతో ఆమె సంజాయిషీ ఇచ్చుకుంది.

ఇక ప్రియాంక చోప్రా విషయం తీసుకుంటే బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి వెళ్లిన ఈ భామ ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్ మెంట్ పై ప్రజలకు అవగాహన కల్పించే ప్రోగ్రామ్స్ చేపట్టింది. దీపావళికి టపాసులు వద్దని చెప్పింది. అయితే ఈ సందేశం అయితే ఇచ్చింది కానీ అది ఆమె పెళ్లిరోజున భారీగా క్రాకర్స్ పేల్చడంలో నెటిజన్లు ఉతికి ఆరేశారు.

ఇక స్వచ్ఛ భారత్ కోసం విద్యాబాలన్,అనుష్క శర్మలు అంబాసిడర్ లు గా ఉన్నారు. ఇందులో విద్యాబాలన్ కేంద్ర ప్రభుత్వ ప్రకటనల్లో దర్శనమిస్తోంది. స్వచ్ఛత, మరుగుదొడ్ల వినియోగం గురించి ఆమె వివరిస్తోంది. అనుష్క శర్మ అయితే ముంబయ్ బీచ్ లో చెత్తాచెదారాన్ని క్లిన్ చేసింది.

రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ ఎవర్ నెస్ ప్రోగ్రామ్స్ లో ముందుంది. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులతో కల్సి ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని హెల్మెట్స్ ధరించాలంటూ ద్విచక్ర వాహన దారులైన జనానికి ఎవర్ నెస్ కల్పించారు. సీటు బెల్ట్ ల ఆవశ్యకత వివరించింది.