Healthhealth tips in telugu

రాగి పాత్రలో నీళ్లు త్రాగుతున్నారా…ఊహించని ఎన్నో లాభాలు…అసలు నమ్మలేరు

copper water bottle benefits in Telugu :ఆయుర్వేదం ప్రకారం రాగి అనేది శరీరానికి అత్యంత ముఖ్యమైన మినరల్. రాత్రంతా రాగి పాత్రలో నీటిని ఉంచి ఉదయాన్నే తాగడం వల్ల ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంటుంది. ఈ విధానాన్ని పురాతన కాలం నుండి మన భారతీయులు పాటిస్తున్న అద్భుతమైన చిట్కా. ఈ చిన్న చిట్కాతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
Copper water benefits In Telugu
రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని త్రాగటం వలన వాత, కఫా మరియు పిత్తాశయ దోషాలు తొలగిపోయి శరీరం సమతుల్యం అవుతుంది. అంతేకాక శరీరంలో పొజిటివ్ శక్తిని పెంచుతుంది. రాగి పాత్రలో నీటిని నిల్వ ఉంచడాన్ని తమ్ర జల్ అని పిలుస్తారు. రాగిలో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఉంటుంది. దీన్నే ప్రాణ శక్తి అని పిలుస్తారు.
Copper Water Bottle
సుమారు ఎనిమిది గంటలపాటు రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగడం వల్ల.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. రాగి పాత్రలో నీరు సుమారు 8 గంటల పాటు నిల్వ ఉంటేనే ఈ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఆ ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం. థైరాయిడ్ వ్యాధితో భాధపడే వారి శరీరంలో కాపర్ చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది.
Thyroid remedies
రాగి పాత్రలోని నీటిని త్రాగడం వల్ల థైరాయిడ్ గ్రంధి పనితీరు మెరుగుపడుతుంది. రాగిలో శోథనిరోధక లక్షణాలు ఎక్కువగా ఉండుట వలన నొప్పుల నివారణలో సహాయపడుతుంది. ముఖ్యంగా కీళ్లవాతంతో పోరడటానికి శక్తివంతంగా సహాయపడుతుంది. నొప్పులతో బాధపడేవారు ప్రతి రోజు రెగ్యులర్ గా రాగి పాత్రలోని నీటిని త్రాగితే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.
Pimples,Beauty
ప్రతి రోజు ఉదయం క్రమం తప్పకుండ రాగి పాత్రలో నిల్వ చేసిన నీటిని త్రాగుతూ ఉంటే మొటిమల సమస్య మరియు మొటిమల కారణంగా వచ్చే నల్లని మచ్చలు తొలగిపోయి ముఖం మృదువుగా అందంగా ఉంటుంది. ముఖంలో సన్నని చారలు, వయస్సు మీదపడుతున్న లక్షణాలు కనపడకుండా చేస్తుంది. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉండుట వలన ఫ్రీ రాడికల్స్ మీద సమర్ధవంతంగా పోరాటం చేస్తుంది.
gas troble home remedies
కొత్తకణాలు ఏర్పాటుకు ,ఆరోగ్యకరమైన చర్మం కణాల ఉత్పత్తి లో సహాయపడుతుంది. ఎసిడిటీ, గ్యాస్, తీసుకున్న ఆహారం జీర్ణం కాకపోవటం వంటి సమస్యలను పరిష్కరిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం మీ పొట్టను డిటాక్స్ ఫై చేసుకోవాలంటే, ప్రతి రోజూ ఉదయం రాగి పాత్రలో నిల్వ ఉంచిన ఒక పెద్ద గ్లాసు నీళ్ళను తీసుకోవాలి. శరీరంలో అనవసరమైన కొవ్వును కరిగించి బరువు తగ్గటంలో సహాయపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.