డయాబెటిస్ ఉన్నవారు బాదం పప్పు తినవచ్చా… ఈ నిజాన్ని తెలుసుకోండి

Diabetes patients eat almonds In Telugu :ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా చిన్న వయసులోనే డయాబెటిస్ బారిన పడుతున్నారు ఒకసారి డయాబెటిస్ వచ్చింది అంటే జీవితకాలం మందులు వాడాల్సిందే అలాగే తీసుకునే ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఏ మాత్రం అశ్రద్దగా ఉన్నా ప్రాణాలకే ప్రమాదంగా మారుతుంది.

ముఖ్యంగా హార్ట్ఎటాక్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి చాలామంది ఏ ఆహారాలు తినాలో తెలియక ఆరోగ్యానికి మంచి చేసే ఆహారాలను కూడా దూరం పెడుతూ ఉంటారు. అలాంటి ఆహారాల్లో బాదం పప్పు ఒకటి. చాలామంది డయాబెటిస్ ఉన్నవారు బాదం పప్పు తినకుండా మానేస్తుంటారు కానీ డయాబెటిస్ ఉన్నవారు బాదం పప్పులను తినవచ్చు

అయితే ఎక్కువ తినకుండా రోజుకు నాలుగు బాదం పప్పులను నానబెట్టి తీసుకుంటే మంచిది. బాదం పప్పును పచ్చిగా కాకుండా నానబెట్టి తీసుకుంటే ఎక్కువ ప్రయోజనాలు పోందవచ్చు. బాదం పప్పు లో ఉండే మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్, మెగ్నీషియం ప్రోటీన్ ఫైబర్ వంటి పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి అద్భుతంగా పని చేస్తాయి. అలాగే అధిక బరువు సమస్య తగ్గుతుంది అంతేకాకుండా మెదడు షార్ప్ గా పనిచేస్తుంది గుండెకు సంబంధించిన సమస్యలు ఏమి ఉండవు