Healthhealth tips in telugu

Beard : గడ్డం పెంచుకుంటే ఇన్ని లాభాలా? ఈ విషయం తెలిస్తే మీరు కూడా గడ్డం పెంచుకుంటారు?

Growing beard benefits in telugu :ఒకప్పుడు ప్రేమలో విఫలమైన వాళ్ళు గుబురు గడ్డంతో కనిపించేవాళ్లు… అయితే ప్రస్తుతం ట్రెండ్ మారింది. గడ్డం పెంచుకోవడం ఈరోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది. ఫ్యాషన్‌తో పాటు దాని వల్ల అనేక లాభాలు ఉన్నాయని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. గడ్డం పెంచుకుంటే కలిగే లాభాల గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.

గడ్డం పెంచుకోవడం వల్ల అనేక చర్మ వ్యాధుల నుంచి దూరం కావొచ్చని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

మీకు గడ్డం ఉంటే ముఖం మంచి మాయిశ్చరైజ్‌ను కలిగి ఉండడంతో పాటు యంగ్ అండ్ స్మార్ట్‌లుక్‌తో అందంగా కనిపించేలా చేస్తుంది.

ముఖ్యంగా సూర్యుడి నుంచి విడుదలయ్యే రేడియేషన్ కిరణాలు నేరుగా ముఖంపై పడకుండా ఆపుతుంది. అందువల్ల చర్మం నల్లగా మారడం,
సూర్యరశ్మి తగిలి కమిలిపోవడం వంటి సమస్యలు రావు. ముఖంలో ముడతలు రావు. యూవీ కిరణాల నుండి కూడా రక్షణ కలుగుతుంది.

క్లీన్ షేవ్ చేసుకున్న ప్రతీసారీ చర్మం మాయిశ్చరైజేషన్ కోల్పోతుంది. దీని వల్ల బ్యాక్టీరియా పెరిగి ఇన్ఫెక్షన్లు, మొటిమలు పెరుగుతాయి. గడ్డం ఉండడం వల్ల ఈ సమస్యలు తలెత్తవు. ముఖంపై మచ్చలు కూడా చాలా వరకూ తగ్గుతాయి.

ప్రస్తుతం అమ్మాయిలు స్మార్ట్‌గా కనిపించే మగాళ్ల కంటే గడ్డంతో కనిపించేవారినే ఎక్కువగా ఇష్టపడతారట.

ఆస్తమా, గొంతు ఇన్ఫెక్షన్‌లకు కారణమయ్యే బ్యాక్టీరియా, టాక్సిన్స్ లోపలికి వెళ్లకుండా గడ్డం నివారిస్తుంది.

ఒకప్పుడు ప్రేయసి కాదంటే గడ్డాలు పెంచిన ప్రేమదాసులు కాస్త ప్రేమకి దాసులు కావాలంటే గడ్డాలు పెంచమంటూ సలహాలిస్తున్నారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.