July 13 రాశి ఫలాలు…ఈ రాశులవారు శుభవార్త వింటారు

Telugu Rasi Phalalu : :భవిష్యత్తులో ఏమి జరుగుతుంది అనే విషయంలో ప్రతి ఒక్కరికీ ఆసక్తి ఉంటుంది అది సహజమే భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ముందే అంచనా వేయడానికి మనలో చాలామంది రాశిఫలాలు చూస్తూ ఉంటారు ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి
చాలావరకు అనుకున్న పనులను పూర్తిచేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు బంధువులు స్నేహితులతో మంచి సంబంధాలు ఉంటాయి విద్యార్థుల మీద ఒత్తిడి కాస్త ఉంటుంది.

వృషభ రాశి
శుభకార్యాలు చేయటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఉద్యోగం విషయంలో కాస్త ఆందోళన ఉంటుంది డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎవరితోనూ వాదన పెట్టుకోకూడదు

మిధున రాశి
వివాహ ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది సంఘంలో పలుకుబడి ఎక్కువగా ఉన్న వారితో పరిచయాలు పెరుగుతాయి దేవుని దర్శనం చేసుకుంటారు ఎవరితోనూ వాదనకు దిగకూడదు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటక రాశి
ఈరోజు ఈ రాశి వారికి గ్రహాల అన్నీ అనుకూలంగా ఉన్నాయి. అనుకున్న పనులు అన్ని నెరవేరుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి శివునికి అత్యంత చేయండి.

సింహరాశి
ఉద్యోగస్తులకు సమయం అనుకూలంగా ఉంటుంది విందు వినోదాలకు వెళ్తారు ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వాదనకు దిగవద్దు సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది.ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న శుభవార్త వింటారు.

కన్యారాశి
పాత స్నేహితులు కలుస్తారు బంధువులతో సరదాగా గడుపుతారు ఉద్యోగం విషయంలో మంచి శుభవార్త వింటారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

తులారాశి
ఇల్లు కట్టాలని ప్రయత్నం సఫలం అవుతుంది చేతిలో డబ్బు సమృద్ధిగా ఉంటుంది విద్యార్థులు కాస్త కష్టపడాల్సి ఉంటుంది వివాదాలకు దూరంగా ఉండండి

వృశ్చిక రాశి
అనుకున్న పనులు చాలా వరకు పూర్తి అవుతాయి విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.శుభవార్త వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ధనస్సు రాశి
వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి కొత్త స్నేహితులు పరిచయం అవుతుంది విద్యార్థులు కాస్త కష్టపడితే మంచి ఫలితం కలుగుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి కూడా మంచి శుభవార్త వినే అవకాశం ఉంది.

మకర రాశి
వీరు ఎంత శ్రమ పడితే అంత ఫలితం కనబడుతుంది తీర్థయాత్రలకు ప్రణాళిక వేస్తూ ఉంటారు విద్యార్థులకు అన్ని విధాలా బాగుంటుంది వివాదాలకు చాలా దూరంగా ఉండాలి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్త వింటారు.

కుంభరాశి
ఉద్యోగస్తులు మంచి అనుకూలమైన సమాచారాన్ని వింటారు శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది విద్యార్థులు చాలా శ్రమ పడాలి శివ ఆరాధన మంచిది.

మీన రాశి
దేవుని పట్ల భక్తి పెరుగుతుంది విద్యార్థులకు చాలా బాగుంటుంది డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.శుభవార్త వినే అవకాశం ఉంది.