పాలు,పండ్లను ఒకేసారి కలిపి తీసుకుంటున్నారా…ఏమి అవుతుందో తెలుసా?

Milk And Fruits :మనిషి తీసుకోవలసిన ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే జీర్ణ వ్యవస్థ చాలా ముఖ్యం. జీర్ణ వ్యవస్థ సరిగా పని చేయకపోతే తీసుకున్న ఆహారం జీర్ణం కాక ఎన్నో రకాల సమస్యలు వస్తాయి అందువల్ల జీర్ణ వ్యవస్థ బాగుండే లాగా మనం తీసుకునే ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

కొన్ని ఆహారాలను కలిపి తీసుకోకూడదు. అలా చేయటం వలన కొన్ని సమస్యలు వస్తాయి పాలు పండ్లు కలిపి తీసుకుంటే కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇలా కలిపి తీసుకోవడం వలన అల్సర్ గ్యాస్ సమస్యలు వస్తాయి. పాలు తీసుకున్నాక పది నిమిషాల సమయం గ్యాప్ ఇచ్చి పండ్లను తినొచ్చు. అలాగే పండు తిన్నాక పదినిమిషాలయ్యాక పాలు తాగవచ్చు

ముఖ్యంగా సిట్రస్ పండ్లను అసలు పాలతో కలిపి తీసుకోకూడదు వాటిలో ఉండే ఆమ్లాలు జీర్ణ వ్యవస్థ మీద ప్రభావాన్ని చూపుతాయి. జీర్ణ వ్యవస్థ సక్రమంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు. ఆహారం తీసుకున్నప్పుడు కొన్ని సూచనలు పాటిస్తే మంచిది ఒకేసారి ఎక్కువగా ఆహారాన్ని తీసుకోకూడదు అలాగే ఆకలి వేసినప్పుడు మాత్రమే ఆహారం తీసుకోవాలి రాత్రి ఎనిమిది లోపే తినేయాలి. మనం రాత్రి పడుకునే లోపు తీసుకునే ఆహారం జీర్ణం కావాలి. అప్పుడే మన జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది