రెగ్యులర్ గా ఈ డ్రై ఫ్రూట్స్ తింటే… ఏమి అవుతుందో తెలుసా ?

Dry fruits helps to reduce anemia In Telugu : ఈ మధ్యకాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ఆడ మగ అనే తేడా లేకుండా చాలామంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోవడం వల్ల రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. రక్తహీనత సమస్య ఉన్నప్పుడు ఆయాసం శ్వాసకోశ సమస్యలు కళ్ళు తిరగడం ఏకాగ్రత లోపించడం తొందరగా అలసిపోవడం విపరీతమైన నీరసం తీవ్రమైన తలనొప్పి ఇలా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

రక్తహీనత సమస్యను చెక్ పెట్టడానికి కొన్ని డ్రై ఫుడ్ చాలా బాగా సహాయపడుతాయి వాటిని రెగ్యులర్ గా తీసుకుంటే చాలా ప్రయోజనం కనబడుతుంది. ఎందు కర్జూరాలు రక్తహీనతను తగ్గించటంలో చాలా బాగా పనిచేస్తాయి రోజుకి మూడు ఎండు ఖర్జూరాలు తీసుకుంటే ఐరన్ సమృద్ధిగా లభించి రక్తహీనత సమస్య తగ్గుతుంది.

వాల్ నట్స్ కాస్త ఖరీదు ఎక్కువైనా రక్త హీనతను నివారించడంలో చాలా సమర్థవంతంగా పని చేస్తాయి ప్రతిరోజు రెండు వాల్నట్ నానబెట్టి తీసుకుంటే వాటిల్లో ఉండే పోషకాలు రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్యను తగ్గిస్తాయి. అలాగే పిస్తా పప్పులో ఉండే విటమిన్ బి రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి సమస్యను తగ్గిస్తుంది. రోజులో 4 పిస్తా పప్పులను తినవచ్చు. ఎండుద్రాక్షలో కూడా ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. రోజులో 4 ఎండు ద్రాక్ష తీసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు చెప్పిన డ్రైఫ్రూట్స్ ప్రతిరోజు డైట్ లో చేర్చుకుంటే రక్తహీనత సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు