MoviesTollywood news in telugu

కేవలం యాడ్స్ నుంచే స్నేహ దంపతులు ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారో…?

Tollywood heroine Sneha :నటీనటులు ఫామ్ లో ఉన్నప్పుడు రెమ్యునరేషన్ బాగానే తెచ్చుకుంటూనే యాడ్స్ లో చేస్తూ రెండు చేతులా సంపాదన లభిస్తోంది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వెండితెరమీద సత్తా చాటుతూ,యాడ్స్ కూడా చేస్తున్నారు. ఇలాంటి వాళ్లలో నటి స్నేహ ఒకరు. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా అగ్ర హీరోల సరసన నటించిన స్నేహ పెళ్లయ్యాక ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తోంది. పైగా ఆమె భర్తతో కలిసి పలు కమర్షియల్ యాడ్స్ లో కూడా చేస్తోంది.

ఇప్పటి వరకూ ఈ జంట కంఫర్ట్ ఫాబ్రిక్ , ఆశీర్వాద్, సన్ ఫీస్ట్ మ్యారి లైట్ , విమ్, జి.ఆర్.టి జ్యుయలర్స్ వంటి ఎన్నో యాడ్స్ లో చేసారు. ఇక స్నేహ ప్రత్యేకించి వైభవ్ కలెక్షన్స్, ఆశీర్వాద్ గులాబ్జామ్ వంటి యాడ్స్ లో చేసింది. మొత్తం మీద ఒక్క యాడ్స్ రూపంలోనే ఇప్పటివరకూ 3.50 కోట్ల రూపాయల దాకా కూడబెట్టారని టాక్. లవర్ బాయ్ తరుణ్ హీరోగా వచ్చిన ప్రియమైన నీకు చిత్రం ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన స్నేహ ఆ తరువాత హనుమాన్ జంక్షన్,శ్రీరామదాసు,సంక్రాంతి,రాధా గోపాలం,వెంకీ వంటి హిట్ సినిమాల్లో నటించింది.

గ్లామర్ పాత్రల కన్నా ప్రాముఖ్యత కలిగిన పాత్రలనే సెలెక్ట్ చేసుకుని ఇండస్ట్రీలో సౌందర్య తరహాలో దూసుకెళ్తుందని అందరూ భావించారు. అయితే అప్పటికే కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడంతో ఈమెకు ఛాన్స్ లు తగ్గడం, తమిళంలో ఆఫర్లు రావడంతో అటు వైపు వెళ్ళింది. అచ్చాముందు! అచ్చాముందు! అనే మూవీ సమయంలో నటుడు ప్రసన్నతో ఏర్పడ్డ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో అతన్ని వివాహం చేసుకుని సెటిల్ అయ్యింది. సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ యాక్టర్ గా రాణిస్తూ, యాడ్స్ లోనూ దుమ్మురేపుతోంది.