Healthhealth tips in telugu

రాత్రి మిగిలిన అన్నాన్ని ఉదయం తింటున్నారా… ఈ నిజాన్ని తెలుసుకోండి

Left Over Rice Health Benefits In telugu : సాధారణంగా ప్రతి ఇంటిలో రాత్రి సమయంలో ఎంతో కొంత అన్నం మిగిలిపోతుంది ఆ మిగిలిన అన్నాన్ని వేస్ట్ చేయడం ఎందుకని ఉదయం లేవగానే చాలామంది తింటూ ఉంటారు. ఆ మిగిలిన అన్నంలో పెరుగు లేదా పచ్చడి వేసుకుని తినేస్తుంటారు.

రాత్రి మిగిలిన అన్నం ఉదయం తినవచ్చా అనే విషయానికి వస్తే… రాత్రిపూట మిగిలిన అన్నంలోకి ఉదయం అయ్యే సరికి బ్యాక్టీరియా చేరుతుంది రాత్రి నుంచి ఉదయం వరకు అంటే దాదాపు 10 గంటల పాటు అన్నం వండి వంటింటిలో అలానే ఉండిపోవటం.. రాత్రి పూట వేడి ఎక్కువగా ఉండటం… ఉదయం లేచే సరికి ఆ అన్నంలో బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది.

అటువంటి అన్నాన్ని తింటే ఫుడ్ పాయిజన్ అవుతుంది. ప్రతిసారి కాకపోయినా అప్పుడప్పుడు అలా అయ్యే అవకాశం ఉంది. అన్నం పండగానే రెండు గంటల లోపు తినేయాలి. చాలామంది అన్నం వేడి చేసుకొని తింటుంటారు అలా చేయకూడదు ఒకసారి అన్నం వండిన తర్వాత మళ్లీ వేడి చేయకూడదు ఎప్పటికప్పుడు తాజాగా అన్నాన్ని వండుకుని తింటే మంచిది ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు.