పరగడుపున 1 అంజీర్ తింటే…ఊహించని ప్రయోజనాలు ఎన్నో…?

fig fruit in telugu :అంజీరా పుట్టినిల్లు అరేబియన్ దేశం. అక్కడ నుండి ఎన్నో దశాబ్దాల క్రితం మన దేశం వచ్చేసింది. ఇది ఎక్కువ ఉష్ణ ప్రాంతాలలో మరియు శీతల ప్రాంతాలలో బాగా విస్తారంగా పెరుగుతుంది. అంజీర  ఎక్కువగా పక్వానికి వచ్చిన పండు కంటే ఎండు ఫలాలుగ బాగా వాడుకలో ఉంది. కొన్ని పండ్లు తాజాగా తీసుకుంటేనే వాటి వల్ల ప్రయోజనం ఉంటుంది.

కానీ, కొన్ని పండ్లలో తాజా కన్నా అవి ఎండిపోయాకే వాటి పోషకాలు రెట్టింపవుతాయి. అలాంటి పండ్లలో అంజీర ఒకటి.  పైగా ఎండు పండ్లను ఎంతకాలమైనా నిలువ చేసుకోవచ్చు. దూరప్రయాణాల్లోనూ వాడుకోవచ్చు.అంజీరను ఆంగ్లంలో ఫిగ్స్ అని అంటారు. హిందీలో అంజీర్ అని పిలుస్తారు. దీనిని సీమ మేడిపండు అని కూడా అంటారు. అంజీర పండు మేడిపండును పోలి వుంటుంది.

కావున, దీనిని సీమ మేడి అని అంటారు.  ప్రత్యేకించి అంజీర పండులో వి టమిన్ ఎ, బి1, బి2, పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్ తో పాటు   కావలసినంత పీచు పదార్థం కూడా ఉంటుంది. ఇవి రక్తహీనత నుంచి విముక్తి కలిగిస్తాయి. మారిన జీవనశైలి కారణంగా ఈ రోజుల్లో  రక్తహీనత ఒక ప్రధాన సమస్యగా మారిపోయింది.

ఈ సమస్యతో బాధ పడుతున్నవారికి అంజీర గొప్ప ఔషధం అని చెప్పవచ్చు.  రక్తహీనత అనగానే ఐరన్ ట్యాబెట్లకు సిద్ధమయ్యే వారికి ఇవి ప్రకృతి సహజమైన అంజీర పండ్లు దివ్య ఔషధం అని చెప్పాలి. పిల్లలు లేని వారు, కనాలనుకునే వారు అంజీర పండ్లు రోజు వారి ఆహారంలో భాగం చేసుకోవాలి.

ఇందులో ఉండు మెగ్నీషియం, మాంగనీసు, జింకు ఖనిజాలు సంతాన సాఫల్యతను పెంచడానికి సహకరిస్తాయి. గర్భధారణ సమయంలో అంజీర తింటే, పుట్టబోయే బిడ్డకు చాలా మంచిది. ఇందులోఉండే పోషకాలు పిండం ఎదుగుదలకు ఉపకరిస్తాయి. అంజీరను మధుమేహం ఉన్నవారు కూడా ఎటువంటి అనుమానం లేకుండా తినవచ్చు.

అంజీరలో ఉండే  పొటాషియం ఇన్సులిన్ మోతాదును క్రమబద్ధీకరిన చేసి  బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేస్తుంది. అంజీరలో ఉండే పీచుపదార్ధం పెక్టిన్ మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది.అంతేకాక హానికారక టాక్సిన్స్ ను వ్యర్ధ పదార్ధాలుగా బయటకు పంపిస్తుంది. పీచు ఎక్కువగా ఉండుట వలన మలబద్దకం సమస్య దరిచేరదు. అంజీరాలలో ఫెనాల్, ఒమేగ3 మరియు ఒమెగ6 ఫ్యాటీఆసిడ్స్ ఉండుట వలన గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.