ఈ మొక్క మీ ఇంటిలో ఉందా…వెంటనే ఈ నిజం తెలుసుకోండి

Sankhu Puvvu Benefits In telugu :ఫాబేసి కుటుంబానికి చెందిన శంఖ పుష్పం పాకే తీగ జాతికి చెందినది. ఈ మొక్క గుబురుగా పెరుగుతుంది. ఈ మొక్క ఆసియా ఖండానికి చెందినది అయినా ఆ తర్వాత ప్రపంచం మొత్తం విస్తరించింది. ఈ పువ్వులు నీలి రంగు,తెలుపు రంగులో ఉంటాయి. శంఖు పువ్వులను కొన్ని రోజుల క్రితం వరకు కేవలం అందం కోసం పెంచుకొనే మొక్కగానే మనలో చాలా మందికి తెలుసు.

అయితే ఈ మధ్యకాలంలో ఆరోగ్య ప్రయోజనాల కోసం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ మొక్కను ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. శంఖు మొక్కను ఎక్కువగా ఫుడ్ కలర్ గాను,టీగాను ఎక్కువగా ఉపయోగించటం వలన బాగా పాపులర్ అయింది. శంఖు మొక్క పువ్వులే కాకుండా వేరు,కాండం,ఆకులు ఇలా మొక్కలో అన్ని భాగాలు ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు.

శంఖు పూలు,ఆకులు,వేళ్ళతో చేసిన పొడి జ్ఞాపకశక్తిని పెంచటంతో పాటు వయస్సు పెరిగే కొద్దీ వచ్చే అల్జీమర్స్ నుండి కూడా రక్షిస్తుంది. అంతే కాకుండా నిద్రలేమి,డిప్రెషన్ వంటి సమస్యలకు కూడా మంచి ముందుగా పనిచేస్తుంది. మన పూర్వికులు ఈ శంఖు మొక్కను బాగా వాడి ఈ ప్రయోజనాలను పొందేవారు.

ఈ మధ్య జరిగిన పరిశోధనల్లో కూడా ఈ విషయం నిరూపణ అయింది. శంఖు పువ్వుల్లో ఉండే ఆర్గనేల్లోలిన్ అనే పదార్ధం మెదడు పనితీరు మీద పనిచేసి మతిమరుపును తగ్గించటంలో సహాయపడుతుంది. శంఖు పువ్వులో ఉండే ప్రోయంతోసైనిడిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కంటి నరాల్లో కంటి సరఫరా బాగా జరిగేలా చేసి రెటీనా దెబ్బతినకుండా కాపాడటమే కాకుండా గ్లకోమా వంటి శాంతి సమస్యలు రాకుండా చేస్తుంది.

అలాగే శంఖు పువ్వులో ఉండే క్యూయెర్సిటిన్ అనే ఫ్లవనాయిడ్ జుట్టు తొందరగా తెల్లపడకుండా చేస్తుంది. అలాగే చర్మంలో కొల్లాజన్ ఉత్పత్తిని పెంచి చర్మం మీద ముడతలు రాకుండా చేస్తుంది. అలాగే ఈ పువ్వు మధుమేహ రోగులకు కూడా చాలా సహాయం చేస్తుంది. రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రణలో ఉండేలా చేస్తుంది. అయితే ఈ శంఖు పువ్వులను ఏ విధంగా తీసుకోవాలో తెల్సుకుందాం.

పువ్వును లేదా ఆకును నోటిలో వేసుకొని నమలచ్చు. లేదా నీటిలో ఆకులు లేదా పువ్వులు లేదా శంఖు మొక్కలో ఏ బాగాన్ని అయినా నీటిలో వేసి మరిగించి ఆ కషాయాన్ని వడకట్టి త్రాగవచ్చు. నీలం రంగులో ఉండే ఈ శంఖు పువ్వులను ఎండబెట్టి పొడి రూపంలో నిల్వ చేసి ఫుడ్ కలర్ గా అనేక రకాల స్వీట్స్,కేకులు,ఐస్ క్రీమ్స్ వంటి వాటిల్లో విరివిగా వాడుతున్నారు.