ఒక్కసారి రాస్తే చాలు 10 నిమిషాల్లో ఎంతటి నల్లటి ముఖమైన తెల్లగా మారడం ఖాయం

Face Glow Tips in telugu :చర్మంపై పొల్యూషన్ కారణంగా దుమ్ము ధూళి వంటివి ముఖంపై పేరుకు పోయి ముఖం నల్లగా మారుతుంది. ఎంత తెల్లగా ఉన్న వారైనా ఎండలో ఎక్కువగా తిరిగితే నల్లగా అయిపోతారు. ముఖంపై వచ్చే నల్లని మచ్చలు నలుపు తొలగించుకోవటానికి ఒక మంచి చిట్కా తెలుసుకుందాం. ఈ చిట్కా కోసం మూడు ఇంగ్రిడియంట్స్ ఉపయోగిస్తున్నాం.

ఒక బౌల్లో ఒక అరటి పండు ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి దానిలో నాలుగు బాదం పప్పులు ఎండు ద్రాక్ష వేసుకోవాలి. బాదం పప్పు కంటి కింద నల్లటి మచ్చలు నల్లటి వలయాలను తొలగించడానికి సహాయపడుతుంది. అరటిపండు ముఖాన్ని మృదువుగా చేస్తుంది ముఖంపై పేరుకుపోయిన దుమ్ము ధూళిని శుభ్రం చేస్తుంది. ఎండు ద్రాక్షలో ఉండే పోషకాలు శరీరంలో రక్తప్రసరణను పెంచి చర్మం నల్లని మచ్చలు లేకుండా మెరిసేలా చేస్తుంది.

ఈ మూడు పదార్థాలను కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ మెత్తని పేస్టులా చేసుకోవాలి ఈ పేస్ట్ లో ఒక స్పూన్ తేనె కలపాలి ఈ మిశ్రమాన్ని మూడు రోజుల పాటు ఫ్రిజ్లో నిల్వ చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి రెండు నిమిషాలు మసాజ్ చేసి ఆరాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది