ఏ రాశి వారు ఏ రంగు రాళ్లను ధరిస్తే మంచి జరుగుతుందో…?

Zodiac signs In Telugu : జాతకాలు, జ్యోతిష్యం మీద సెంటిమెంట్స్, నమ్మకాలూ ఎక్కువే. అందుకే తమ నక్షత్రం, రాశి ఆధారంగా రంగురాళ్లను ధరిస్తూ ఉంటారు. రంగు రాళ్లను పొదిగిన ఉంగరాలను చేతికి పెట్టుకుంటారు. అయితే ఇటువంటి రాళ్లు పొదిగేటప్పుడు నాణ్యతను కూడా చూసుకోవాలని లేకుంటే ఫలితం రాదని పండితులు సూచిస్తుంటారు. పండితుల పట్ల వ్యత్సాసాలు ఉన్నా, చాలామంది పండితుల అంచనా ప్రకారం చూస్తే, మేషరాశి వాళ్ళకు కుజగ్రహం అధిపతి కనుక ఎరుపు రంగు పగడపు రత్నం ధరిస్తే మంచిదట.

వృషభ రాశివారికి శుక్రగ్రహం అధిపతి కనుక వజ్రపుటుంగరం / వజ్రపు గొలుసు ధరించాలని పండితుల సూచన. మిధున రాశివాళ్ళు పచ్చ / మరకతం రంగు రాయిని ధరించాలి. బుధ గ్రహం అధిపతిగా గల కన్య రాశి వాళ్ళు కూడా ఇదే ధరిస్తే మంచిదట చంద్రుడు అధిపతిగా గల కర్కాటక రాశివాళ్ళు ముత్యం ధరిస్తే మంచిదట. సూర్యుడు అధిపతి గా గల సింహరాశి వాళ్ళు ఎర్రటి కెంపు ధరించడం మంచిదని పండితుల సూచన.

ఇక శుక్ర గ్రహం అధిపతిగా గల తులా రాశివాళ్ళు వజ్రపుటుంగరం / వజ్రపు గొలుసు ధరిస్తే మంచిదని పండితుల సూచన. అంగారక గ్రహం పాలించే వృచ్చిక రాశివాళ్ళు ఎర్రటి పగడపు రాయి ధరిస్తే మంచిదని అంటున్నారు. గురుగ్రహం అధిపతిగా గల ధనుస్సు రాశివాళ్ళు పసుపు నీలమణి ధరిస్తే మంచిదని పండితుల సూచన. శనిగ్రహం అధిపతిగా గల మకర రాశివాళ్ళు అలాగే కుంభరాశి వాళ్ళు కూడా నీలం రంగు నీలమణి ధరిస్తే మంచిదట. గురుగ్రహం పాలించే మీన రాశివాళ్ళు పసుపు నీలమణి ధరిస్తే శుభాలు కలుగుతాయట.