Beauty Tips

ఒక్క చిట్కాతో పేలు టపటప రాలిపోతాయి… జీవితంలో పేలు అస్సలు ఉండవు

How to remove head lice In Telugu : తలలో పేలు పట్టాయంటే ఒక పట్టాన తగ్గవు విపరీతమైన దురద వస్తుంది. జుట్టు ఎక్కువ సేపు తడిగా ఉండటం వలన కూడా పేలు చాలా వేగంగా పెరుగుతాయి. తడి మరియు చెమట కారణంగా పేలు పెరిగే అవకాశం ఉంది. చాలా మంది పేలను వదిలించుకోవటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినా కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు

ఇప్పుడు చెప్పే ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. వేప ఆకులలో వెల్లుల్లి రెబ్బలను, కలబంద గుజ్జును వేసి కొంచెం నీటిని కలిపి మెత్తని పేస్ట్ గా చేయాలి ఈ పేస్ట్ ని వడకట్టి రసాన్ని తీసుకోవాలి. ఈ రసాన్ని తలకు బాగా పట్టించి పదినిమిషాల పాటు ఎండ తగిలేలా ఉండాలి ఆ తర్వాత శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత దువ్వెనతో దువ్వితే పేలు అన్నీ రాలిపోతాయి.

పేలును వదిలించుకోవటానికి ఈ చిట్కా చాలా బాగా సహాయపడుతుంది అలాగే వేప నూనె కూడా పేలను తగ్గించుకోవటానికి సహాయపడుతుంది.