Healthhealth tips in telugu

రెడ్ రైస్ ఎప్పుడైనా తిన్నారా…ఈ ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టకుండా తింటారు

Red Rice Benefits In telugu : ప్రపంచవ్యాప్తంగా చూస్తే బియ్యంలో దాదాపుగా 40 వేల రకాలు ఉన్నాయి వాటిల్లో రెడ్ రైస్ ఒకటి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా మంది రెడ్ రైస్ తినటానికి చాలా ఆసక్తిని చూపిస్తున్నారు మరికొంతమంది రెడ్ రైస్ తింటే ఏ ప్రయోజనాలు కలుగుతాయో తెలియక తినడం లేదు.
red rice 2
ఇప్పుడు చెప్పే ప్రయోజనాల గురించి తెలుసుకుంటే తినని వారు కూడా రెడ్ రైస్ తింటారు. డయాబెటిస్ ఉన్నవారికి రెడ్ రైస్ సంజీవని వంటిదని చెప్పవచ్చు. ఎందుకంటే తెల్ల బియ్యం తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. కానీ రెడ్ రైస్ లో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. .
Diabetes diet in telugu
అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు తెల్ల బియ్యం మానేసి రెడ్ రైస్ తింటే చాలా మంచిది. అలాగే దీనిలో మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన శరీరం ఆక్సిజన్ ని ఎక్కువగా గ్రహించేలా చేస్తుంది. ఆస్తమా సమస్య ఉన్నవారికి చాలా మంచిది. కాల్షియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన ఎముకలు దృఢంగా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా వయసు పెరిగే కొద్దీ వచ్చే ఎముకలకు సంబంధించిన సమస్యలు కూడా ఏమీ ఉండవు.
Red Rice Benefits In telugu
అధిక బరువు సమస్య నుంచి కూడా బయటపడవచ్చు. రెడ్ రైస్ లో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల బరువు తగ్గటానికి సహాయ పడుతుంది. మలబద్ధకం వంటి సమస్యలు ఉండవు. రెడ్ రైస్ లో ఉండే పోషకాలు చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి రక్తప్రారణ బాగా సాగేలా చేసి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. దాంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
red rice 2
ఈ బియ్యంలో B6 సమృద్దిగా ఉండుట వలన DNAలో ఎర్రరక్త కణాలు తయారు కావటానికి మరియు మన ఆర్గాన్లు చక్కగా పనిచేయటానికి సహాయపడుతుంది. రెడ్ రైస్‌లో ఆంథోసియానిన్, మాంగనీస్, జింక్ ఉండుట వలన విష పదార్ధాలను శరీరం నుండి బయటకు పంపేస్తుంది. మెనోపాజ్ తర్వాత వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. సాధ్యమైనంత వరకూ రెడ్ రైస్ తినటానికి ప్రయత్నం చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.