తెల్ల అన్నం ఒకటి చాలు… ముఖంపై ఒక్క ముడత కూడా ఉండదు

Anti aging face mask In Telugu : ముఖంపై ముడతల సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు టైటినిగ్ ఫాక్స్ ఉపయోగిస్తుంటాం. వీటివల్ల ఎక్కువ ఖర్చు అవుతుంది అయినా పెద్దగా ఫలితాలు ఉండవు ఇంట్లో తయారు చేసుకునే చిట్కాలు ప్రారంభదశలో ఉన్న ముడతలను తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

ముడతలు వస్తే చిన్న వయస్సులోనే పెద్దవారిగా కనబడతారు దాని కోసం ఒక మంచి చిట్కా తెలుసుకుందాం. ఉడికించిన అన్నాన్ని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి ఆ పేస్టులో ఒక స్పూన్ బాదం ఆయిల్ వేసుకోవాలి. ఈ పేస్ట్ ముఖానికి పట్టించి అరగంటయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

బియ్యంలో ఉండే అనేక రకాల పోషకాలు ముడతలను, పిగ్మెంటేషన్ తగ్గించి ముఖం కాంతివంతంగా యవ్వనంగా ఉండేలా చేస్తుంది. ఈ చిట్కాను పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు బాదం ఆయిల్ చర్మానికి తేమను అందించి చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది