మోకాళ్ళు, మోచేతుల పై నలుపు పోవాలా… ఇలా చేస్తే సరి

Dark elbows and knees reduce Tips In telugu : నెయ్యి అంటే ఇష్టపడని వారు ఉండరు. ప్రత్యేకమైన రుచి వాసన కలిగి ఉండే నెయ్యి అంటే పిల్లల నుంచి పెద్దవారి వరకు ఇష్టపడుతుంటారు. నెయ్యిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ విషయం మనకు తెలుసు అయితే చర్మ సంరక్షణలో కూడా చాలా బాగా సహాయపడుతుంది. కొంతమందికి మోచేతులు మోకాళ్ళపై నల్లగా ఉంటుంది. ఈ సమస్య పరిష్కారానికి నెయ్యి చాలా బాగా సహాయపడుతుంది.

ఒక బౌల్లో రెండు స్పూన్ల నెయ్యి, రెండు చుక్కల టీ ట్రీ ఆయిల్ వేసుకుని బాగా కలిపి మోకాళ్ళు మోచేతుల పై రాసి వృత్తాకార మోషన్ లో రెండు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఆ తర్వాత బాగా ఆరాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి రోజు ఒకసారి చేస్తూ ఉంటే మోకాళ్ళు, మోచేతుల మీద ఉన్న నలుపు తొలగిపోయి చర్మం తెల్లగా మృదువుగా మారుతుంది

ఒక బౌల్లో రెండు స్పూన్ల నెయ్యి, ఒక స్పూన్ బంగాళదుంప రసం వేసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని మోచేతులు, మోకాళ్లకు పట్టించి రెండు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే క్రమంగా నలుపు తగ్గిపోతుంది