కోడిగుడ్ల‌ను ప‌చ్చిగా తాగుతున్నారా…అయితే ప్రమాదంలో పడినట్టే

Egg Benefits in telugu :మనలో చాలా మంది కోడిగుడ్డు తింటూ ఉంటారు. కొంతమంది కోడిగుడ్డును తినరు. అలాగే కొంతమంది పచ్చిగాను,కొంతమంది ఉడికించుకొని తింటూ ఉంటారు. కోడి గుడ్డును ఆమ్లెట్ లేదా కూరగా గాని ఉడికించి గాని తింటూ ఉంటాం. కొంత మంది మాత్రం కోడిగుడ్డును పచ్చిగా కొట్టేసుకొని త్రాగేస్తూ ఉంటారు. కానీ అందరిలోనూ ఒక సందేహం ఉంటుంది.

కోడిగుడ్డు పచ్చిగా తింటే మంచిదా లేదా ఉడికించుకొని తింటే మంచిదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఒక వేళ పచ్చిగా తింటే ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తాయా? గుడ్డును పచ్చిగా అలాగే కొట్టుకుని త్రాగవచ్చు. కానీ ఓక్ విషయం గుర్తు పెట్టుకోవాలి. కోడిగుడ్లతో సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది.

కోడిగుడ్డును ఉడికించినప్పుడు ఆ బ్యాక్టీరియా నశిస్తుంది. అయితే పచ్చిగా త్రాగితే ఆ బ్యాక్టీరియా శరీరంలోకి చేరుతుంది. కోడిగుడ్డుతో ఈ బ్యాక్టీరియా స్వల్ప మోతాదులో ఉంటుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉన్న మనిషికి ఎటువంటి హాని కలగదు. కానీ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఇన్‌ఫెక్ష‌న్లు, జ్వ‌రం వ‌స్తాయి. అలాగే ఆరోగ్యమైన వ్యక్తులు కూడా రెగ్యులర్ గా కూడా త్రాగకూడదు. ఎందుకంటే వారిలో బ‌యోటిన్ అనే పోషక లోపం ఏర్పడుతుంది.

ఈ లోపం కారణంగా చ‌ర్మంపై దుర‌ద‌లు, వెంట్రుక‌లు రాలిపోవ‌డం, న‌రాల బ‌ల‌హీన‌త వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. కాబట్టి కోడిగుడ్డు పచ్చిగా త్రాగాలని అనుకొనే వారు కాస్త ఆలోచించండి.