కృష్ణ, చిరంజీవి అగ్నిజ్వాల సినిమా ఆగిపోవటానికి కారణం…?

Super star krishna,Megastar Chiranjeevi movie Agni Jwala :చిత్ర సీమలో ఎవరి సపోర్ట్ లేకుండా ఎదిగిన సూపర్ స్టార్ కృష్ణ, స్వయంకృషితో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి కల్సి హీరోలుగా నటించిన ఏకైక చిత్రంగా తోడుదొంగలు మూవీ నిలుస్తుంది. ఇంకో చిత్రం తీయడానికి ప్రయత్నాలు జరిగినా కుదర్లేదు. వాటి వివరాల్లోకి వెళ్తే,హీరో కృష్ణతో సినిమా తీయాలని పంపిణీ దారుడు,నిర్మాత నవభారత్ బాబూరావు సంకల్పించారు. ఆయన అంతకుముందు ఆడదంటే అలుసా అనే మూవీ నిర్మించారు. పెళ్లిళ్ల పేరయ్య రెండవ చిత్రంగా తీసాక మూడవ చిత్రం హీరో కృష్ణతో తీయాలని భావించారు.

అంతేకాదు, అంతవరకూ వచ్చిన కృష్ణ సినిమాల కంటే భారీగా ఉండాలని బాబూరావు భావించారు. కృష్ణ కూడా ఒకే చెప్పారు. అదే సమయంలో మలయాళంలో హిట్ అయిన సినిమా రీమేక్ హక్కులు కొనుగోలు చేసిన బాబురావు తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఆచార్య ఆత్రేయ చేత మార్పులు చేర్పులు చేయించారు. అన్నదమ్ములు పాత్రల కోసం కృష్ణ,చిరంజీవి లను అనుకున్నారు. అక్క పాత్రకు జయంతిని తీసుకోవాలని నిర్ణయించారు. కె ఎస్ ఆర్ దాస్ ని డైరెక్టర్ గా అనుకుని అగ్నిజ్వాల అనే పేరు నిర్ణయించారు.

కృష్ణ డేట్స్ ఇచ్చాక చిరంజీవి డేట్స్ కోసం నిర్మాత వెళ్లారు. కృష్ణతో సినిమా అనగానే చిరు కూడా ఉత్సాహం చూపించారు. అయితే డేట్స్ కుదరక పోవడంతో మరో హీరో కోసం ప్రయత్నం చేయమని కృష్ణ సూచించారు. అదే సమయంలో విష్ణు వర్ధన్, పద్మప్రియ జంటగా నటించిన అసాధ్య ఆలీయా మూవీ విడుదలై సక్సెస్ అందుకుంది.

దీన్ని చూసిన కృష్ణ ఈ సినిమా రీమేక్ చేస్తే బాగుంటుందని చెప్పడంతో రీమేక్ హక్కులు కొన్నారు. దీంతో అగ్నిజ్వాల మూవీ స్క్రిప్ట్ పక్కన పెట్టేసి, అసాధ్య అలియా మూవీని మాయదారి అల్లుడు పేరిట రీమేక్ చేసారు. కృష్ణ,జయప్రద జంటగా వచ్చిన ఈ మూవీ కె ఎస్ ఆర్ దాస్ డైరెక్షన్ లో తెరకెక్కింది. సినిమా బాగానే ఆడింది. అయితే అగ్నిజ్వాల మూవీ స్క్రిప్ట్ ని బాబురావు వదల్లేదు. మోహన్ బాబు,నరేష్ కాంబోలో తీశారు.