రోజు చిన్న ముక్క తింటే ఊహించని ప్రయోజనాలు ఎన్నో…ముఖ్యంగా రక్తహీనత…?

Jaggery Health Benefits In telugu : మనలో కొంతమంది బెల్లం అంటే ఇష్టపడతారు. మరి కొంతమంది పంచదార అంటే ఇష్టపడతారు. అయితే పంచదార కన్నా బెల్లం తినటమే మంచిది. ఈ విషయం మనలో చాలా మందికి తెలియదు. బెల్లం తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

పండుగల వేళ ఇంట్లో చేసే నైవేద్యాలు, పిండివంటల్లో ఎక్కువగా బెల్లాన్ని వాడటం తెలిసిందే. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో బెల్లం, వేయించిన వేరుశనగపప్పులను మేలైన చిరుతిండిగా పరిగణిస్తారు. బెల్లం పోషకాల గని అని పోషకాహార నిపుణులు కూడా సూచిస్తున్నారు. బెల్లం శరీరానికి కావలసిన తక్షణ శక్తినిచ్చి అలసటను దూరం చేస్తుంది.

టీలో పంచదారకు బదులు చెంచా బెల్లం పొడి వాడటం వల్ల మధుమేహ బెడద ఉండదు. బెల్లంలోని పొటాషియం రక్తపోటు నివారణ, నియంత్రణకు దోహదం చేయటమే గాక మూత్రపిండాలలో రాళ్ళ సమస్యను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

మానసిక ఒత్తిడిని దూరం చేసి కంటి నిండా కునుకు పట్టటానికీ ఇందులోని పొటాషియం ఉపయోగపడుతుంది. పిల్లల ఎదుగుదలకు, ఎముకల బలంగ ఉండటానికీ బెల్లంలోని కాల్షియం అక్కరకొస్తుంది.

ఇప్పటిరోజుల్లో నూటికి 40 మంది మహిళలు రక్తహీనతతతో బాధపడుతున్నారు. రక్తహీనత బాధితులు రోజూ 50 గ్రాములు బెల్లం తింటే తగినంత ఐరన్ అంది సమస్య దూరమవుతుంది. ఇంకెందుకాలస్యం.. ఈ రోజు నుంచే మీ డైట్‌లో బెల్లాన్ని చేర్చుకోండి. వయస్సుతో సంబందం లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ బెల్లన్ని తినవచ్చు.