‘టు టౌన్ రౌడీ’ సినిమా మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్…?

Venkatesh Two town rowdy Movie :సినిమాలలో వారసత్వం సహజం. హీరోల వారసులే కాదు, హీరోయిన్ వారసులు కూడా వస్తూనే ఉన్నారు.మంజుల కూతుళ్లు,అలనాటి హీరోయిన్ లక్ష్మి కూతురు ఐశ్వర్య ఇలా చాలామంది వచ్చారు. ఇంకా వస్తున్నారు. పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న లక్ష్మి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా సత్తా చాటుతోంది.

అయితే ఆమె కూతురు ఐశ్వర్య కన్నడ మూవీ హోస కావ్య లో నటించి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అలాగే తెలుగులో జగపతి సరసన అడవిలో అభిమన్యుడు మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే అంతకుముందే హిందీలో బ్లాక్ బస్టర్ అయిన తేజాబ్ మూవీకి రీమేక్ గా దాసరి నారాయణరావు డైరెక్షన్ లో విక్టరీ వెంకటేష్ హీరోగా చేసిన, టు టౌన్ రౌడీ మూవీలో ఐశ్వర్య ను హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటే తల్లి లక్ష్మి కారణంగా ఛాన్స్ మిస్సయింది.

అదెలా అంటే, ఓసారి, విమానంలో వెళ్తుంటే లక్ష్మిని చూసి పలకరించిన నిర్మాత రామానాయుడు కుశల ప్రశ్నలు వేస్తూ, అమ్మాయిని సినిమాల్లోకి తీసుకొస్తున్న విషయం తెల్సుకుని, విమానం దిగాక నేరుగా లక్ష్మి ఇంటికి వెళ్లి ఐశ్వర్యను చూసి, వెంకీకి జోడీగా సరిపోతుందని అన్నారట.

టు టౌన్ రౌడీ మూవీ కోసం దాసరికి ఫోటోలు పంపిస్తే ఆయన ఒకే చెప్పారట. అన్నీ ఒకే అవుతున్న సమయంలో సినిమాలో ఓ సీన్ విషయంలో లక్ష్మి అభ్యంతరం చెప్పారట. ఐశ్వర్యకు ఇష్టం ఉన్నా సరే, తల్లి కారణంగా ఆ సీన్ లో యాక్ట్ చేయడం ఇష్టం లేక ఛాన్స్ వదిలేసుకుంది. ఇంతకీ ఆ సీన్ ఏమిటంటే స్విమ్ సూట్ లో కన్పించాలట.