బొప్పాయి విత్తనాలు బంగారం కంటే విలువైనవి…ఎందుకంటే…

papaya seeds Benefits In Telugu :సాధారణంగా మనలో చాలా మంది బొప్పాయిని తిని బొప్పాయి గింజలు పాడేస్తూ ఉంటారు. బొప్పాయి గింజలు లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉంటాయి కానీ వాటి గురించి మనలో చాలా మందికి తెలీదు. ఒక రకంగా చెప్పాలంటే బొప్పాయి కంటే బొప్పాయి గింజలు లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది రోజుకి 10 నుంచి 15 బొప్పాయి గింజలను పొడిగా చేసి సలాడ్లు లేదా కూరలలో జల్లుకొని తినవచ్చు.

కిడ్నీ వ్యాధులను నయం చేస్తుంది. శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలపరచి బ్యాక్టీరియల్ మరియు వైరల్ ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది అంతేకాకుండా కీళ్ల నొప్పులు,మంట, నొప్పి వంటి వాటిని కూడా తగ్గిస్తుంది.జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. మలబద్దకం సమస్య ఉన్న వారికి బాగా సహాయ పడుతుంది.

బొప్పాయి గింజలలో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన జీర్ణశక్తిని మెరుగుపరచటమే కాకుండా అధిక బరువు,కొలస్ట్రాల్ ని తగ్గిస్తుంది. అంతేకాకుండా రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. వీటిని తినటం వలన కండరాలు దృడముగా మారతాయి. పని ఒత్తిడి కారణంగా కలిగే అలసటను తొలగిస్తుంది.

చాలా మందికి బొప్పాయి గింజలను ఎలా తీసుకోవాలో తెలియదు. ఈ గింజలను ఎండబెట్టి పొడి చేసుకొని నిల్వ చేసుకోవచ్చు. ఈ పొడిని కాఫీ,టీ లలో కలుపుకొని తీసుకోవచ్చు. బొప్పాయి గింజల పొడి కాస్త చేదుగా ఉంటుంది కాబట్టి బెల్లం,తేనె వంటి వాటితో కూడా తీసుకోవచ్చు. రోజుకి పావు స్పూన్ మోతాదు మించకుండా తీసుకోవాలి. ఏమైనా అనుమానాలు ఉంటే ఆయుర్వేద డాక్టర్ ని సంప్రదించాలి.