‘లవ్ స్టోరీ’ ట్విట్టర్ రివ్యూ….సినిమా ఎలా ఉందంటే…?

Love Story Twitter Review In Telugu : అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్స్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా ఈరోజు థియేటర్స్ లో విడుదలైంది. ఈ సినిమాని చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను తెలిపారు. ఈ సినిమాకి సంబంధించి పోస్టర్స్,టీజర్, పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి. మొన్న విడుదలైన ట్రైలర్ కి కూడా భారీ స్పందన వచ్చింది. చాలా రోజుల తర్వాత అడ్వాన్స్ బుకింగ్ తో హైదరాబాదులో ధియేటర్స్ హౌస్ ఫుల్ అవుతున్నాయి. ఈ సినిమాకి వారం ముందే బుకింగ్ ప్రారంభం అయింది.

ఇక సినిమా విషయానికి వస్తే… గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథ మొదటిసారిగా నాగ చైతన్య తెలంగాణ యాసలో మాట్లాడి ఆకట్టుకున్నాడు అలాగే డాన్సులు కూడా ఇరగదీశాడు. నాగచైతన్య డాన్స్ ల కోసం చాలా కష్టపడ్డాడు. ఏదో సాధించాలనే తపన తో హైదరాబాద్ వచ్చిన హీరో హీరోయిన్ వారి మధ్య ప్రేమ…ఆ ప్రేమ పెళ్లి పీటల వరకు తీసుకువెళ్లే క్రమంలో వారు ఎదుర్కొన్న కష్టాలను సినిమాలో చూపించారు ఎప్పట్లాగానే సాయి పల్లవి తన నటన డాన్స్ తో ఆకట్టుకుంది.

ఫస్టాఫ్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ పంచుతూ సెకండాఫ్‌కి వచ్చే సరికి కథపై గ్రిప్పింగ్ తీసుకొచ్చి బాగా ప్రెజెంట్ చేశారనే టాక్ వస్తోంది.అయితే రొటీన్ ఫ్యామిలీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు తెచ్చారని, సినిమాలో చెప్పుకోదగిన కొత్త సన్నివేశాలు ఎక్కడా కనిపించలేదని కొందరు అభిప్రాయ పడుతున్నాయి. లీడ్ పెయిర్ అయిన నాగ చైతన్య, సాయి పల్లవి బెస్ట్ పర్‌ఫార్‌మెన్స్ ఇచ్చారని, ఈ లవ్ స్టోరీకి సాయి పల్లవి డాన్స్, మ్యూజిక్ స్పెషల్ అసెట్ అనే ట్వీట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.

కథలో శేఖర్ కమ్ముల మార్క్ కనిపించిందని, మొత్తానికి థియేటర్స్‌లో చూడదగ్గ సినిమా అని, మూవీ పక్కా బ్లాక్ బస్టర్ అవుతుందని కొందరు చెబుతుండగా,సినిమా ఆద్యంతం ఆకట్టుకున్నప్పటికీ క్లైమాక్స్ పై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.